calender_icon.png 4 February, 2026 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌దే చేర్యాల మున్సిపల్ పీఠం

04-02-2026 01:50:11 AM

రెవెన్యూ డివిజన్ హామీని విస్మరించిన కాంగ్రెస్

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే

చేర్యాల, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం చేర్యాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్, సీపీఎం నాయకలతో కలిసి మున్సిపల్ పరిధిలోని 1,2,10,11,12 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లను కలిశారు.మిత్రపక్షమైన సీపీఎంకి 3వ వార్డు కేటాయించగా ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సీపీఎం నాయకులతో ఆయన ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు,సంక్షేమ పథకాలను వివరిస్తూ గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభు త్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఆయన ఓట్ల ను అభ్యర్థించారు.

చేర్యాలను రేవన్యు డివిజన్ చేస్తా మని ఇచ్చిన హామీ ఏమైంది ఆయన కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అమలు కానీ ఆరు గ్యారెంటీల పేరుతో  ఓట్లు దండుకున్నదే కానీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.అభివృద్ధే మా మంత్రం.. గత పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే మన అభ్యర్థులను గెలిపిస్తాయని ఎమ్మెల్యే పల్లా ధీమా వ్యక్తం చేశారు.చేర్యాల ప్రాంత సమగ్ర అభివృద్ధి కేవలం బీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.

అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా కష్టపడి పనిచేసి, పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా గత శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఇక్కడి ప్రజలకు నీలిమ ఆస్పత్రిలో అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వార్డుల్లో ఏ సమస్యలు ఉంటే తన నియోజకవర్గ నిధులతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే వార్డు సమస్యల బాధ్యత తీసుకుంటానని, చేర్యాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆయా పార్టీల నాయకులు, కార్యక ర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.