28 June, 2026 | 4:32 PM

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ

28-06-2026 03:42 PM

రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని పల్లె దవకాణాల్లో పల్స్ పొలియో కార్యక్రమాన్నీ నిర్వహించారు.సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య, 1వ వార్డు మెంబర్ గసికంటి ప్రమీల రాజు,14వ వార్డు మెంబర్ ఉప్పులూటీ గణేష్, 13వ వార్డు మెంబర్ శీలం స్వాతి మీనయ్య,పాల్గొని ఫోలియో చుక్కల కార్యక్రమాన్నీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 5 సంవత్సరల లోపు పిల్లలందరికి తల్లిదండ్రులు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.మీరు వేయించే రెండు పోలియో చుక్కలు మీ పిల్లల సంపూర్ణ ఆరోగ్యనికి వెలుగు దివ్వెలని అన్నారు.పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దాలని అలాగే పోలియో మహమ్మరిని దేశం నుండి తరిమేయలని కోరారు.హెల్త్ మొబైల్ సెంటర్ ద్వారా ఉరి చివరన ఉన్న పిల్లలకు అలాగే ఇటుకబట్టీల్లో పని చేసే  పిల్లలకు వారివద్దకే వెళ్లి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు.5 ఏండ్లలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.