తహసీల్దార్లుగా 70 మంది డీటీలు
- ఫలించిన టీజీటీఏ, టీజీఆర్‌ఎస్‌ఏ కృషి
- మంత్రి పొంగులేటికి, సీసీఎల్‌ఏకు
- నాయకులు కృతజ్ఞతలు
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్(టీజీఆర్‌ఎస్‌ఏ) కృషి ఫలితంగానే 70 డీటీలకు తహసీల్దార్లుగా పదోన్నతి లభించిందని ఆయా సంఘాల రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రాములు, రమేష్ పాక, బాణాల రాంరెడ్డి, వి భిక్షం పేర్కొన్నారు. మల్టీ జోన్-1లో 43, మల్టీజోన్ -2లో 27 చొప్పున పదోన్నతి కల్పించారన్నారు.
పదోన్నతి ప్రక్రియకు సహకరించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, సీసీఎల్‌ఏ లోకేశ్‌కుమార్‌కు బుధవారం కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటు ఈ పదోన్నతుల ప్రక్రియలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డిగారి కృషి ఎంతో ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెవెన్యూ శాఖను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ఇదే కాకుండా అన్ని స్థాయిలలో పదోన్నతులను కూడా ఇస్తూ ఉద్యోగులకు అండగా నిలుస్తున్నారన్నారు.




