పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించండి
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
చిన్న చింతకుంట మార్చు 18 : జిల్లా ప్రధాన ఆస్పత్రిలో అవసరమైన సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పిం చాల్సిన అవసరం ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో కోషన్ అవర్ సమయంలో దేవరకద్ర ఎమ్మెల్యే జై మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 25 వెంటి లెటర్ బెడ్ లకు గాను మరో 25 అదనపు వెంటిలేటర్ బెడ్ లను ఏర్పాటు చేయాలని, గత రెండేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రులకు పేషెంట్లు అధికంగా వస్తున్నారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల సంఖ్యను పెంచాలన్నారు.
దేవరకద్ర నియోజకవర్గంకు సంబంధించి... నియోజకవర్గంలో 67 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉందని, జరుగుతున్న యాక్సిడెంట్లను దృష్టిలో ఉంచుకొని, ఒక ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రిని, 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని, చిన్నచింతకుంట మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రను ,పేరూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లుగా అప్గ్రేట్ చేయాలన్నారు. చిన్న చింతకుంట, దేవరకద్ర లో రెండు డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.




