దేశ్ కా బడా ముల్క్
హైదరాబాద్ మహానగరం రూపం మళ్లీ మారనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో ఆవిష్కృతమైన మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ హైదరాబాద్ క్రమంగా హైదరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీగా, తదనంతరం హైదరాబాద్ మహా నగరాభివృద్ది సంస్థగా ఆవిష్కృతమయ్యింది. తాజాగా.. హైదరాబాద్ మహా నగరాభివృద్ది సంస్థను ఔటర్ దాటించాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్
నిర్ణయించడంతో హైదరాబాద్ మహా నగరాభివృద్ది సంస్థను ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే జరిగితే భారతదేశంలోనే అతి సువిశాలమైన నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.
n భారతదేశంలో అతిపెద్ద నగరంగా మారనున్న హైదరాబాద్
n గతంలో కేవలం 174 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం
n ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల మేర..
n భవిష్యత్తులో 12 వేల చదరపు కిలోమీటర్ల వరకు..
n హెచ్‌ఎండీఏ పరిధిలోనే ౪౫ శాతం జనాభా
n సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు
వరకు హెచ్‌ఎండీఏ విస్తరణకు అధికారుల కసరత్తు
తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ జిల్లా క్రమంగా మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ హైదరాబాద్ (హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు)గా అవతరించి 174 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించారు. తదనంతరం హైదరాబాద్ శివారులోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు మున్సిపాలిటీలను, కార్పోరేషన్ లను కలుపుతూ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌గా అవతరించింది. అనం తరం హైదరాబాద్ నగరాన్ని అత్యంత ప్రణాళిక బద్దంగా అభివృద్ది చేయాలనే సంకల్పంతో అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా)ని ఏర్పాటు చేసింది.
అనంతరం 2008 ఆగస్టు 25న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌తో సహా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి 70 మండలాలు, సుమారు వెయ్యి గ్రామాలను (138 నగర పంచాయతీలను), గతంలోని 40 మున్సిపాలిటీలను కలుపుకొని, హైదరాబాద్ ఎయిర్‌ఫోర్టు డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఏడీఏ), సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారి టీ (సీడీఏ), బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ (బీపీపీఏ)లను విలీనం చేస్తూ.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్‌గా గుర్తిస్తూ.. ఈ ప్రాంతాన్ని అత్యంత ప్రణాళికబద్దంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో నాటి ప్రభుత్వం హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)ను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధి 7, 257 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీలతో పాటు మెట్రో వాటర్ అండ్ సీవరేజ్ బోర్డు, తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్, తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్ ఫోర్టు కా ర్పోరేషన్‌లను కార్యకలాపాలను కూడా హెచ్‌ఎండీఏ పర్యవేక్షణ, సమన్వయం చేస్తుంది.
హెచ్‌ఎండీఏ పరిధిలోకి 45 శాతం జనాభా...
హైదరాబాద్ మహానగరం చుట్టూ 158 కి.మీ.పొడవునా ఔటర్ రింగు రోడ్డు విస్తరించి ఉంది. ఔటర్ రింగు రోడ్డుకు మరో 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంగా ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు సుమారు 340 కిలోమీటర్ల పొడవుతో హెచ్‌ఎండీఏ పరిధిలోని జిల్లాలను కలుపుతూ సమీప భవిష్యత్తులోనే అందుబాటులోకి రానుంది. ఈ రీజినల్ రింగు రోడ్డు సుమారు 20 పట్టణాలను/నగరాలను, 17 జాతీయ రహదారులను, అలాగే వందల సంఖ్యలో రాష్ట్ర రాహదారులను అనుసంధానించనున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో హైదరాబాద్ మహా నగరాభివృద్ది సంస్థ సుమారు 12 వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశం ఉంది. అలాగే హెచ్‌ఎండీఏ పరిధి పెరగడంతో పాటు నగరీకరణ పెరుగుతున్న కారణంగా డెన్సిటీ కూడా హెచ్‌ఎండీఏ పరిధిలో భారీగా పెరుగుతుంది. దీంతో రాష్ట్రంలోని మొత్తం జనాభాలో సుమారు 45 శాతం జనాభా హెచ్‌ఎండీఏ పరిధిలోకి రానుంది.
తగ్గనున్న రద్దీ.. పెరగనున్న వసతులు, ఉపాధి అవకాశాలు
రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటుతో నగరం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాల రద్దీ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ప్రధానంగా తూఫ్రాన్, ములుగు, భువనగిరి, మల్కాపూర్, ఆగపల్లి, కొత్తూర్, షాద్‌నగర్, చేవెళ్ల, షాబాద్, కేశంపేట్, నర్సాపూర్, శంకర్‌పల్లి, చౌటుప్పల్, ఇబ్రహీంప ట్నం, ఆమన్‌గల్, కంది, సంగారెడ్డి వరకు హెచ్‌ఎండీఏ పరిధి విస్తరిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. పల్లెలు పట్టణాలుగా మారనున్న నేపథ్యంలో నగరానికి వలస వచ్చే వారి సంఖ్య కొంతవరకు తగ్గుతుందని, పెరుగుతున్న నగరీకరణతో స్థానిక ప్రజలకు అనేక రకాల ఉపాధి అవకాశాలు స్థానికంగానే లభిస్తాయనే అభిప్రాయం హెచ్‌ఎండీఏ అధికారు ల నుంచి వ్యక్తం అవుతున్నది. ప్రభుత్వ నిర్ణ యం మేరకు ఆర్‌ఆర్‌ఆర్ వరకు రేడియల్ రోడ్లు, గ్రిడ్ రోడ్లు నిర్మాణంతో పాటు ఔటర్ రింగు రోడ్డు ఆర్‌ఆర్‌ఆర్ మధ్యలో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాధనలు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఊపందుకోనున్న రియల్ ఎస్టేట్...
ఇప్పటికే ట్రిపుల్ ఆర్ చుట్టూ అనేక ఒపెన్ ప్లాట్ వెంచర్లు వెలిశాయి. ప్రస్తుతం నగరంలో ఔటర్ లోపల, వెలుపల గేటెడ్ కమ్యునిటీలలో స్థిరాస్తి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉన్నాయి. దీనికి తోడు ట్రిపుల్ ఆర్ వరకు హెచ్‌ఎండీఏ విస్తరణ ప్రకటనలతో హెచ్‌ఎండీఏ పరిధిలోని 8 జిల్లాల్లోను భూముల ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. దీంతో హెచ్‌ఎండీఏ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను పెట్టేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని రియాల్టర్లు పేర్కొంటున్నారు. అయితే హెచ్‌ఎండీఏ విస్తరిస్తున్న పరిధిలో నాణ్యమైన నివాస యోగ్యమైన ప్రాంతాలు లేవనే చెప్పాలి. ప్రజలకు అవసరమైన కనీస కమ్యునిటీ నీడ్స్ కల్పిస్తే నగర శివారులో గేటెడ్ కమ్యునిటీలు, భారీ టౌన్‌షిప్‌లు, హైరేజ్ భవంతులు పుష్కలంగా విస్తరించే అవకాశం ఉందనే అభిప్రాయం స్థిర, చర ఆస్తుల రంగాల నిపుణుల నుంచి వ్యక్తం అవుతుంది.
అభివృద్ధి వికేంద్రీకరణ
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి నిర్ణీత ప్రాంతానికే పరిమితమైంది. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి పరిపాలన వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణకు కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వ డం, అందులో భాగంగా నూతన జిల్లాల, మున్సిపాలిటీల ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేసుకుంది. అలాగే దేశంలోనే హైదరాబాద్ ది బెస్ట్ లీవబుల్ సిటీగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థను ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలనే నిర్ణయం ఆహ్వానించదగిన నిర్ణయం. కొత్తగా హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో ప్రణాళికబద్దమైన అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం మూడింతల అదనపు వృద్ధిని నమోదు చేసుకుంటుంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది.
జక్కా వెంకట్ రెడ్డి,
తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ గౌరవ సలహాదారు, ఏవీ కన్‌స్ట్రక్చన్ ఎండీ.
* ప్రస్తుతం భారతదేశంలోని నగరాల విస్త్తీర్ణం (చ.కి.మీ.)
13,000
హైదరాబాద్
8,005
బెంగళూరు
7,256
పూణె
6,328
ఎంఎంఆర్
5,904
చెన్నై
1,876
అహ్మదాబాద్
1,866
కోల్‌కత్తా
1,484
ఢిల్లీ






