24-04-2025 02:13:07 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: జమ్మూ కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం ఉగ్రదాడుల్లో మృతి చెందిన 26 మంది బాధితుల వివరాలను అధికారులు విడుదల చేశారు. ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకుల మృతదేహాలకు శ్రీనగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంత్‌నాగ్ పోలీసులు కం ట్రోల్ రూమ్ వద్ద హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. కుటుంబసభ్యులు, పర్యాటకుల కోసం 0194 0194 2483 651 హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా అధికారులను సంప్రదించవచ్చు. ఈ దాడిలో౨౬ మంది మరణించిన విషయం తెలిసిందే.
మృతుల వివరాల జాబితా
1. సుశీల్ నత్యాల్ ఇండోర్
2. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా పహల్గాం స్థానికుడు
3. హేమంత్ సుహాస్ జోషిఛొ ముంబై
4. వినయ్ నర్వాల్ హర్యానా
5. అతుల్ శ్రీకాంత్ మోని మహారాష్ట్ర
6. నీరజ్ ఉద్వానీ ఉత్తరాఖండ్
7. బిటన్ అధికారి కోల్‌కతా
8. సుదీప్ నియుపానే నేపాల్
9. శుభం ద్వివేది ఉత్తర్ ప్రదేశ్
10. ప్రశాంత్ కుమార్ ఒడిశా
11. మనీశ్ రంజన్ బీహార్
12. ఎన్.రామచంద్ర కేరళ
13. సంజయ్ లక్ష్మణ్ లల్లి ముంబై
14. దినేశ్ అగర్వాల్ చండీగఢ్
15. మధుసూదన్ సోమిశెట్టి బెంగళూరు
16. సమీర్ గుహార్ కోల్‌కతా
17. దిలీప్ దసాలీ ముంబై
18. శైలేష్ భాయ్ హెచ్ కలాథియా గుజరాత్
19. జె. సచంద్ర మోలీ విశాఖపట్నం
20. సంతోష్ జగ్డా మహారాష్ట్ర
21. మంజునాథ్ రావు కర్ణాటక
22. కస్తుబా గంటోవత్య మహారాష్ట్ర
2౩. భరత్ భూషణ్ బెంగళూరు
25. సుమిత్ పర్మర్ గుజరాత్
26. యతేశ్ పర్మర్ గుజరాత్
27. టగెహాల్యిగ్ అరుణాచల్ ప్రదేశ్