calender_icon.png 10 May, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ గగనతలం గుండా రాని ప్రధాని విమానం

24-04-2025 02:14:26 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని బుధవారం ఢిల్లీకి హుటాహుటిన వచ్చారు. అయితే తిరుగుప్రయాణంలో ఆయన విమానం పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరోమార్గంలో ప్రయాణించింది.

ఈమేరకు ఫ్లుటై ట్రాకింగ్ వెబ్‌సైట్‌లో ఆ దృశ్యాలు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం ప్రధా ని నరేంద్రమోదీ ప్రయాణించిన ఎయిర్‌ఫోర్స్ బోయింగ్ 777 పాకిస్తాన్ గగనతలం మీదుగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ చేరుకుంది. అయితే ముష్కరుల దాడి నేపథ్యంలో తిరుగుప్రయాణానికి వేరే మార్గాన్ని ఉపయోగించారు.

ప్రధాని విమానం పాకిస్తాన్ గగనతలం నుంచి కాకుండా అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ గగనతలంలోకి ప్రవేశించి అక్కడినుంచి ఢిల్లీకి చేరుకుంది. పాకిస్తాన్ నుంచి ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రమాణమార్గాన్ని మార్చినట్లు తెలుస్తోంది.