calender_icon.png 10 May, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనీమూన్‌కు వచ్చి నేవీ లెఫ్టినెంట్ మృతి

24-04-2025 02:11:27 AM

హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల వినయ్ నర్వాల్ భారత నేవీలో లెఫ్టినెంట్. వినయ్‌కి ఈనెల 16న హిమాన్షితో వివాహమైంది. 19న అట్టహాసంగా రిసెప్షన్ వేడుక జరిగింది. కొత్త జంట హనీమూన్‌కు స్విట్జర్‌లాండ్ వెళ్దామని నిర్ణయించుకున్నది.

కానీ.. వీసా సమస్యతో టూర్ ఆగిపోయింది. దీంతో దంపతులు జమ్మూకశ్మీర్‌లోని బైరసన్ లోయను ఎంచుకున్నారు. 21న అక్కడికి చేరుకున్నారు. ఆ మరుసటి రోజే ముష్కరులు పహల్గాంలో కాల్పులు జరిపారు. కాల్పుల్లో వినయ్ మృతిచెందాడు. మే1న వినయ్ పుట్టిన రోజు.