27 July, 2026 | 12:03 PM

Breaking News

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •   మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు   •  

ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే దేవకీ నందన’

16-11-2024 09:36 PM

దివంగత నటుడు కృష్ణ మనవడు, టాలీవుడ్ స్టార్ మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న చిత్రం దేవకీ నందన వాసుదేవ’. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందించగా, దర్శకుడు అర్జున్ జంధ్యాల తెరకెక్కించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అర్జున్ శనివారం విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమై చిత్ర విశేషాలను పంచుకున్నారు. గుణ 369’ తర్వాత దేవకీ నందన వాసుదేవ’ నా రెండో సినిమా. ఇందులో కంసుడు, కృష్ణుడు రిఫరెన్స్ ఉంటుంది. మూడో సంతానం వల్ల మరణం అని ట్రైలర్‌లోనే క్లియర్‌గా చెప్పాం.

అయితే ట్రైలర్‌లో కంటే ఎక్కువ కథ ఇంకా ఉంది. దర్శకుడిగా కథను ఓన్ చేసుకోవాలి. అప్పుడే కొన్ని ఐడియాలు వస్తాయి. నేను చెప్పిన కొన్ని ఆలోచనలకు ప్రశాంత్ వర్మ హ్యాపీగా ఫీలయ్యారు. -ఈ కథను బట్టి అశోక్ క్యారెక్టర్ నుంచి అతని లుక్ డిజైన్ చేసుకున్నాం. -మురారి’లో ఒక డెస్టినీ ఫీల్ ఉంటుంది. ఇందులో అది ఇంకోరకంగా ఉంటుంది. హీరో గండం నుంచి ఎలా బయటపడతారనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. హీరోయిన్ మానస వారణాసిది ఇందులో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. -దేవదత్త కంసరాజ్ పాత్రను చాలా అద్భుతంగా చేశారు. ఇది మంచి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ధర్మం అంటే దేవుడు అనే మాట సారాంశం కథలో అంతర్లీనంగా వెళుతుంది’’ అని చెప్పారు.