15 April, 2026 | 5:17 AM

చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందిచుకోండి

06-12-2025 12:00 AM

జిల్లా క్రీడా అధికారి శ్రీయం.పరంధామరెడ్డి 

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 5, (విజయక్రాంతి):జనవరి నెల5 తారీకు నుండి 9 తారీఖు వరకు పంజాబ్ రాష్ట్రం చండీఘర్ లో జరగనున్న ఆల్ ఇండియా యూనివర్సిటీస్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా కు చెందిన కాకతీయ యూనివర్సిటీలో B. ped ద్వితీయ సంవత్సరం చదువుతున్న క్రీడాకారుడు యాసం జంపన్న ఎంపికయ్యా రు.

ఇటీవల వరంగల్ లో జరిగిన రాష్ట్రస్థాయి ఇంటర్ యూనివర్సిటీ రెజ్లింగ్ పోటీ లలో 86 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో అత్యం త ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి ఆల్ ఇండియా యూనివర్సిటీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలొ పాల్గొనేందుకు అర్హత సాధించారు.ఆల్ ఇండియా యూనివర్సిటీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన సందర్భంగా శుక్రవారం జిల్లాస్పోరట్స్ అథారిటీ అధికారి శ్రీ ఎం పరంధామ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆల్ ఇండియా యూని వర్సిటీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన జంపన్న ఆయన అ భినందించారు.

ఈ సందర్భంగా శ్రీ పరంధామ రెడ్డి మాట్లాడుతూ బాల,బాలికలు యువతీ యువకులు చదువుతోపాటు క్రీడ ల పట్ల ఆసక్తి కనబరచాలని, క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు గెలుపొంది, ప్రభుత్వం కల్పిస్తున్న క్రీడా రిజర్వేషన్ ద్వారా ఉన్నత చదువులకు , ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉం టుందన్నారు.క్రీడల్లో ప్రతిభ కన పరుస్తున్న క్రీడాకారులను జిల్లా కలెక్టర్ అన్ని విధాలుగా తగిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చే సుకోలని కోరారు.జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కోచ్ పి.కాశీ హు స్సేన్ వద్ద రెజ్లింగ్ లో శిక్షణ పొందుతున్న జంపన్న గతంలో కూడా పలు రాష్ట్ర, జాతీ య స్థాయి పోటీలలో పోటీలలో అనేక బహుమతులు ,పతకాలు గెలుపొందారు. కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కాశీ హుస్సే  తదితరులు పాల్గొన్నారు.