మల్లన్నను దర్శించుకున్న ఎస్‌సీఆర్ జనరల్ మేనేజర్
06-12-2025 12:00 AM
కొమురవెల్లి, డిసెంబర్ 5: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వా మిని రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ్ దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ దేవాలయ విశిష్టతను, ఈవో వెంకటేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో స్వామివారి చిత్రపటం తో పాటు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కా ర్యక్రమంలో ఏ ఈ ఓ బుద్ధ శ్రీనివాస్, ఆల య ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.






