calender_icon.png 7 February, 2026 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత్ మున్సిపాలిటీలు

07-02-2026 02:29:35 AM

  1. అవినీతి రహిత పాలన అందిస్తాం.. పన్నుల పెంపు ఉండదు 
  2. ఆర్థికసంఘం ఇచ్చే నిధులు పారదర్శకంగా ఖర్చుచేస్తాం
  3. బీజేపీని అడ్డుకోవడానికే సీఎం రేవంత్ హేట్ స్పీచ్ చట్టం  
  4. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను కాపాడుతున్నదే సీఎం
  5. నాడు ఓటుకు నోటు కేసులో సీఎంను కాపాడినందుకే..
  6. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  7. ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): బీజేపీని గెలిపిస్తే మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంటి పన్ను తో సహా ఎలాంటి పన్నుల పెంపూ ఉం డదని ఆ పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు ప్రకటించారు.  వికసి త్ భారత్.. వికసిత్ తెలంగాణగా వికసి త్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దడమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.

శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల సహ ఇన్‌చార్జ్‌లు అశోక్ పర్ణామి, రేఖా శర్మతోపాటు మరికొంత మంది నేతలతో కలిసి వికసిత్ తెలంగాణ-బీజేపీ సంకల్ప పత్రం- 2026 పేరుతో రూపొందించిన మ్యానిఫెస్టోను ఎన్ రాంచందర్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  మున్సిపాలిటీల్లో అవినీతి రహిత పాలన అందించడమే కాకుండా, అవినీతికి పాల్పడితే అధికారు లు, తమ పార్టీ నాయకులపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీని గెలిపిస్తే పెండింగ్ పన్నుల్లో వెసులుబాటు కల్పిస్తామన్నారు.

ఆర్థికసంఘం ఇచ్చే నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తామని, మున్సిపాలిటీల్లో యువతకు నైపు ణ్య శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.  బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసి కేసులు పెడుతున్నారని, మాకు కూడా కేంద్రంలో ప్రభుత్వం ఉంది జాగ్రత్త అని హెచ్చరించారు.  మున్సిపల్ ఎన్నికల్లో  బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. యువతకు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తామని, కబ్జాలపై ఉక్కుపా దం మోపుతామన్నారు. 

ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదని, ఫస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని, తెలంగాణకు ఏమివ్వలేదని తమను విమర్శిస్తున్నారో చెప్పాలన్నారు. తాము ఏ జిల్లాకు ఏమిచ్చామో చెబుతామ ని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఏమిచ్చాయో చెప్పాలన్నారు. రెండ్రోజులుగా పోలీస్ వ్యవస్థ మొత్తం తమ కార్యకర్తలపై దాడులు చేస్తోందని ఆరోపించారు.  కేంద్రంలో ఉన్నది తమ ప్రభుత్వమేనన్న విషయాన్ని మరిచిపోవద్దని ఆయన హెచ్చరించారు. 

బీజేపీ మ్యానిఫెస్టో ఇలా

 సమ్మిళిత, సుస్థిర అభివృద్ధికి బీజేపీ మ్యానిఫెస్టో 

* పదేళ్ల బీఆర్‌ఎస్ అవినీతి పాలననే కాం గ్రెస్ కొనసాగిస్తూ ఉందని, ఈ ప్రభుత్వంలో 40 శాతం ఆర్‌ఆర్ కమిషన్లు లేనిదే ఫైళ్లు కదలడంం లేదని, అభివృద్ధి కన్న అనవసర వ్యయయాలపై అధికంగా వెచ్చించడం వం టి కారణాల వల్ల రాష్ర్టం దివాళా అంచున నిలిచిందని పలు అంశాలను మ్యానిఫెస్టోలోని మొదటి పేజీలో ప్రస్తావించారు. ము న్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు అందే ఫైనా న్స్ కమిషన్ నిధులను పక్కదారి పట్టించడంతో పాటు ఇబ్బడి ముబ్బడిగా ఇంటి పన్ను, ఇతర పన్నులు పెంచి ప్రజలన నుంచి దండుకోవాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తోందని పేర్కొన్నారు.

పేరుకుపోతున్న చెత్త, పొంగిపొర్లే మురికి కాలువ లు, తాగునీటి సమస్యలు, పని చేయని వీధి దీపాలు, గుంతలమయమైన రహదారులు, నిర్వవహణలేని పార్కులు, కమ్యూనిటీ హా ళ్ల్లు, అందుబాటులో లేని వైద్య సేవలు.. ఇలా చెప్పుకొంటూ పోతే మున్సిపాలిటీలు, కార్పరేషన్లలో సమస్యలు అనేకమని వివరించారు. ‘ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం’ అని నినదించిన రేవంత్ రెడ్డి పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోతున్నదని పేర్కొన్నారు.

తెలంంగాణ అభివృద్ధికి పీఎం మోదీ ప్రభుత్వం గత పదకొండున్ననర ఏళ్లలో దాదాపు రూ.12 లక్షల కోట్లు రాష్ట్రానికి ఇవ్వడంతో పాటు ప్రస్తుత బడ్జెట్‌లోనూ భారీగా నిధులు, ప్రాజెక్టులను కేటాయించిందని వెల్లడించారు. 2014 నుంచి ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం దాదాపు రూ.20 వేల కోట్ల నిధులను 14, 15, 16 ఫైనాన్స్ కమిషన్ల ద్వారా తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కేటాయించింది.

ఇవి కాకుండా స్మార్ట్ సిటీస్, అమృత్, స్వచ్ఛ భారత్, ఆవాస్ యోజన వంటి అనేక పథకాల ద్వారా మరో రూ.10 వేల కోట్లను ఇచ్చింది. అయితే ఈ నిధులను గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పక్కదారి పట్టించాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి మ్యానిఫెస్టో రూపంలో ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం.

వైద్యం-ఆరోగ్యం

* బస్తీ దవాఖానాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం. ప్రధానమంత్రి జన ఔషధి యోజన ద్వరా తక్కువ ధరకు మందులు అందుబాటులో ఉంచుతాం. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తాం. 

* దోమలు, పందులు, కోతులు, కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. 

డిజిటల్ గవర్నెన్స్-అవినీతి రహిత సేవలు

* మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో కట్టే ఇళ్లకు నిర్మాణం పూర్తయ్యే వరకు అనుమతి తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ నిబంధనలు సవరిస్తాం.

* సింగిల్ విండో ద్వారా అనుమతులు. గృహ, వ్యాపార అనుమతులకు ఎటువంటి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ క్లియరెన్స్.

* భవన నిర్మాణ అనుమతులకు సెల్ఫ్ సర్టిఫికేషన్’.కృత్రిమ మేధ ద్వారా ప్లాన్‌వెరిఫికేషన్ చేసి వారం రోజుల్లో అనుమతులు. 

* జనన/మరణ ధృవీకరణలు, ట్రేడ్ లైసెన్సులు, పన్ను చెల్లింపుల కోసం వన్ యాప్ సొల్యూషన్ డిజిటల్ ప్లాట్ ఫారమ్.

* మున్సిపల్ ఫైళ్ల కదలికను పౌరులు ట్రాక్ చేసేలా లైవ్ ఫైల్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం.

* ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ కోసం వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తెస్తాం. టైం బౌండ్‌లో సమస్యలను పరిష్కరిస్తాం.

 హరిత పట్టణాలు

ఫేమ్ పథకంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. మున్నిసల్ బడ్జెట్‌లో 10 శాతం నిధులను పచ్చదనం కోసమే కేటాయించి, ప్రతి వార్డులో మియావాకీ అర్బన్ ఫారెస్ట్ అభివృద్ధి చేస్తాం.

సామాజిక భద్రత

* మహిళల భద్రత కోసం మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేస్తూ సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తాం.

* కాలనీల నుంచి మెయిన్ రోడ్ల వరకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎలక్ట్రిక్ ఆటోలు/బస్సులు) ఏర్పాటు చేస్తాం.

పాలనలో ప్రజల భాగస్వామ్యం

* ప్రతి మూడు నెలలకు ఒకసారి వార్డు సభ నిర్వహించి బడ్జెట్ కేటాయింపుల్లో పౌరుల సూచనలు తీసుకుంటాం. 

* వార్డు కమిటీల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తాం.

* మున్సిపాలిటీల్ల ఫిర్యాదులు స్వీకరించేందుకు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి 48 గంటల్లో పరిష్కరించేలా మున్సిపల్ కస్టమర్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం.

ఆర్థిక సాధికారత

అభివృద్ధి పనుల కోసం నిధుల సమీకరణకు పెద్ద మున్సిపాలిటీల ద్వరా మున్సిపల్ బాండ్ల జారీ. ఈ మ్యానిఫెస్టో కేవలంం ఒక పత్రం కాదు, తెలంంగాణ నగరాలు, పట్టణాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలు నెలకొల్పే కార్యాచరణ ప్రణాళిక. పౌర సదుపాయాలు, మౌలిక వసతులు, ఉపాధి కల్పపన, విద్య, వైద్య సౌకర్యాలు ఎంత అత్యున్నతంగా ఉంటాయో, ప్రజల జీవనం అంత సులభతరంగా ఉంటుంది.

అందుకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీస్, అమృత్, హృదయ్, డిజిటల్ ఇండియా వంటి అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు.  పథకాల అమలుకు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందాం...మన నగరాన్ని/పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం.! అంటూ మ్యాని ఫెస్టోను ముగించారు. 

గృహనిర్మాణం

* మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లలో ఇండ్లులేని పేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు కృషి చేస్తాం.  టాయిలెట్ల కోసం స్వచ్ఛ భారత్ కింద రూ.12,000 ఆర్థిక సాయం చేస్తాం.

ఉపాధి కల్పపన 

* పట్టణ యువతకు ఐటీ, అనుబంధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు మున్సిపల్ పరిధిలో స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తాం. దీన్ దయాళ్ కౌశల్ వికాస్ యోజన కింద యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. స్థానిక పరిశ్రమలు, వ్యాపార సంస్థల సమన్వయంతో జాబ్ మేళాల నిర్వహణ. స్వయం ఉపాధి కోసం పీఎం స్వనిధి, ముద్ర, పీఎం విశ్వకర్మ తదితర పథకాల కింద బ్యాంకు రుణాలు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తాం.

కొత్త మున్సిపల్ పన్నులు విధించం

వచ్చే ఐదేళ్లపాటు ఇంటి పన్నుతో సహా ఎలాంటి కొత్త పన్నులుండవు. ఇంటి పన్ను దీర్ఘకాల బకాయిలు ఉన్న వారికి డిస్కౌంంట్‌తో చెల్లించే అవకాశం కల్పిస్తాం. 

సమగ్ర మౌలిక సదుపాయాలు

* ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, కాలం చెల్లిన పైపులైనులున్న చోట కొత్త పైపులైన్లు, నీటి వృథాను అరికట్టటడానికి స్మార్ట్ వాటర్ మీటరింగ్ విధానం ఏర్పాటు చేస్తాం. 

* మురుగునీటికి శాశ్వత పరిష్కారం, మురికి కాలువలను శుభ్రపరిచేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు, అన్ని మున్సిపాలిటీల్లో 100 శాతం భూగర్భ డ్రెయినేజీ ఏర్పాటు చేస్తాం. నాలాల కబ్జాలను నివారించి వర్షా కాలంలో కాలనీలను వరద ముంచెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. వాననీటి సంరక్షణకు ఇంకుడు గుంతలను ప్రోత్సహిస్తాం. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్న గృహాలకు ఇంటి పన్ను, నల్ల బిల్లులో డిస్కౌంట్ సదుపాయం కల్పిస్తాం. అన్ని కాలనీల్లో సీసీ రోడ్లను, గుంతలు లేకుండా ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం.

* రోడ్లను ఇష్టారీతిన తవ్వవకుండా వివిధ శాఖల సమన్వయంతో అన్ని రకాల కేబుళ్లను వాటర్ లైన్ల కోసం  మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలలో అండర్ గ్రౌండ్ యుటిలిటీ టన్నెల్ ఏర్పాటు చేస్తాం. 

* మోడ్రన్ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, రిక్రియేషన్ ఫెసిలిటీస్‌తో ప్రతి మైనర్ మున్సిపాలిటీలో 1, ప్రతి మేజర్ మున్సిపాలిటీలో 2 మల్టీ పర్పస్ పార్కులు ఏర్పాటు చేస్తాం. 

* అమత్ పథకాన్ని పక్కగా అమలు చేస్తాం. బీజేపీ గెలిచిన మున్సిపాలిటీల్లో ఈ పథకం కింద మరిన్ని ప్రత్యేక నిధులను తేచ్చి అభివృద్ధి సాధిస్తాం.

* స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రత్యే నిధులను తీసుకొచ్చి ఇంటి దగ్గరే ఉచితంగా చెత్తసేకరణ చేసి, తడి-పొడి చెత్త వేరు చేసేంందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ పట్టణాలకు దూరంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తాం. స్వచ్ఛ భారత్ పథకం కింద కేంద్ర నిధులు సేకరించి వేస్ట్ టు ఎనర్జీ  ప్లాంట్ల ద్వారా వ్యర్థాలు నిర్మూలిస్తాం. ప్రతి మున్సిపాలిటీ, కార్పరేషన్లలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి, వాటిని రీసైక్లింగ్ చేసేందుకు ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేస్తాం.   పనుల్లో మానవ ప్రమేయం లేకుండా రోబోటిక్ క్లీనింగ్ యంత్రాల వినియోగిస్తాం. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘నమస్తే’ కింద మరిన్ని నిధులతో సాకారం చేస్తాం.

* ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు, ఫ్లుఓవర్ల నిర్మాణం. సేతు భారతం పథకం కింద మరిన్ని కేంద్ర నిధులు తీసుకొచ్చి ఈ హామీ నెరవేరుస్తాం.

* కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఎస్‌ఎల్‌ఎన్‌పీ కింద నిధులు తీసుకొచ్చి అన్ని కాలనీల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు. సెన్సార్ ఆధారిత స్మార్ట్ గ్రిడ్ పరిధిలోకి వీధి దీపాలు, దీంతో విద్యుత్ ఆదా.

* స్మార్ట్ సిటీస్ మిషన్, నిర్భయ ఫండ్ నిధుల ద్వారా అన్ని కాలనీల్లోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా.

* అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో వర్కింగ్ విమెన్ కోసం వారి పిల్లలను సంరక్షించేందుకు డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.

* మున్సిపల్ పరిధిలోని మార్కెట్ యార్డులో రూ.5లకే భోజనం అందించే క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తాం. 

* మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లలో పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు పార్కింగ్ కాంప్లెక్సులు ఏర్పాటు చేస్తాం.

* యువ ఎంటర్ ప్రీనర్లను, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రతి కార్పొరేషన్‌లో జెన్‌ౠ కోవర్కింగ్ హబ్‌లను ఏర్పాటు చేస్తాం. స్టార్టప్ ఇండియాలో భాగంగా వారికి అవసరమైన మార్గదర్శనం అందిస్తాం.

* ఆలయాలను పరిరక్షిస్తాం. దేవాలయ భూముల కబ్జాలను అడ్డుకుంటాం. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గోశాలలు నిర్మించి గోవులను పరిరక్షిస్తాం.

మ్యానిఫెస్టో ప్రధాన హామీలు

* మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఇంటి పన్ను సహా ఎలాంటి పన్నుల పెంపూ ఉండదు.

* ఆన్ లైన్, సింగిల్ విండో సిస్టం ద్వారా వారం రోజుల్లో ఇంటి అనుమతులు.

* ప్రతి వార్డు/డివిజన్‌లో బస్తీ దవాఖానాల బలోపేతానికి కృషి, చౌక ధరల్లో మందులు. 

* అర్హత కలిగిన మున్సిపాలిటీలు/కార్పొరేషన్‌లను స్మార్ట్ సిటీస్‌గా ప్రకటించేలా కేంద్రాన్ని ఒప్పిస్తాం. 

* మున్సిపాలిటీ/కార్పొరేషన్‌లను క్లీన్ సిటీ/గ్రీన్ టౌన్‌గా తీర్చిదిద్దుతాం.

* అన్ని మున్సిపాలిటీ/కార్పొరేషన్‌లో దోమలు, కోతులు, పందులు, కుక్కల బెడదను నివారిస్తాం.

* ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు అండర్ పాస్, ఓవర్ హెడ్ బ్రిడ్జిలు నిర్మిస్తాం.

* అన్ని మున్సిపాలిటీ/కార్పొరేషన్లలో 100 శాతం అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ.

* మున్సిపాలిటీల్లో దేవాలయాల పరిరక్షణ, కబ్జాల నుంచి దేవాలయ భూ ముల విముక్తి, ప్రతి మున్సిపాలిటీల్లో గోశాలల ఏర్పాటుతో గోవులకు రక్షణ.

* అన్ని మున్సిపాలిటీ/కార్పొరేషన్లలో పోలీస్ శాఖ సహకారంతో షీ టీమ్స్ వ్యవస్థ బలోపేతం.

* అన్ని మున్సిపాలిటీ/కార్పొరేషన్లలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, క్రమం తప్పకుండా జాబ్ మేళాలు.

* మైనర్ మున్సిపాలిటీలో 1, మేజర్ మున్సిపాలిటీలో 2 మల్టీ పర్పస్ పార్కులు.

* ప్రాజెక్టుల ఆడిట్, అవినీతి నిరోధానికి కృత్రిమ మేధ వినియోగం.

* మురకివాడల నివాస ప్రాంతాల కోసం సమగ్రమైన మురికివాడల పునరాభివృద్ధి, ఆధునీకరణ ప్రణాళికను ప్రారంభిస్తాం.

* వంద శాతం చెత్త సేకరణకు ప్రతి వార్డులో మైక్రో కంపోస్టింగ్ కేంద్రాలు.

* గార్బేజ్ ఫ్రీ నగరాల కోసం వికేంద్రీకృత వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు.

బీఆర్‌ఎస్‌ను కాపాడుతున్నదే రేవంత్ 

బీజేపీకి ఆదరణ పెరుగుతుంది కాబట్టే భయపడి బీజేపీని అడ్డుకోవాలని సీఎం రేంత్ రెడ్డి హేట్ స్పీచ్ చట్టం తేవాలని భావిస్తున్నారన్నారు. గతంలో ఆయన అడ్డగోలుగా మాట్లాడలేదా? హేట్ స్పీచ్ అమలైతే మొదటి కేసు రేవంత్ రెడ్డిపైనే పెట్టాలన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను ఇరికించేందుకు, అక్రమ కేసులు బనాయించేందుకు కర్ణాటకలో తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లును తెస్తున్నారని విమర్శించారు.

తెలంగాణలో దొండగలు పోయి దోపిడి దొంగలు వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌తో దోస్తీ లేకుంటే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై ఎందుకు విచారణకు ఆదేశింలేదన్నారు. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో బీఆర్‌ఎస్ కాపాడినట్టే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్‌ను రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని తెలిపారు.