28 May, 2026 | 2:46 AM

కలిసి పనిచేస్తేనే అభివృద్ధి

28-05-2026 02:14 AM
  1. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 
  2. రూ.50 కోట్లతో ఆర్నకొండ- మల్యాల డబుల్ రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం

చొప్పదండి, మే 27 (విజయ క్రాంతి): కలిసి పనిచేస్తే అభివ్రుద్ధి ఏ విధంగా సాధ్య మో చొప్పదండి నియోజకవర్గమే నిదర్శనమని, రాజకీయాలను పక్కనపెట్టి నమ్మి ఓట్లే సిన ప్రజల కోసం కలిసి పనిచేయడంవల్ల చొప్పదండికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి, అభివ్రుద్ది పనులు కొనసాగుతున్నా యి. అందులో భాగంగానే 50 కోట్లతో ఆర్నకొండ మల్యాల డబుల్ రోడ్డు విస్తరణ పను లను ప్రారంభించుకోగలగుతున్నామని కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ కుమార్ అన్నారు.

చొప్పదండి మండ లం ఆర్నకొండ-మల్యాల 35 కి.మీల డబుల్ రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మే యర్ సునీల్ రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, తదితరులతో కలిసి కేంద్ర మంత్రి ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చొప్పదండి మండలం అర్నకొండ గ్రామం నుండి గోపాల్ రావు మీదుగా మల్యాల వరకు మొత్తం 35 కి.మీల మేరకు సింగిల్ రోడ్డును డబుల్ లేన్ రోడ్డుగా విస్తరించే పనులకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.

మొత్తం 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ రోడ్డును విస్తరించబోతున్నామని, కేంద్ర ప్రభుత్వానికి సంబం ధించి సిఆర్‌ఐఎఫ్ నిధులతో ఈ పనులను చేపడుతున్నామన్నారు. ఈ రోడ్డు పనులు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మే లు జరుగుతుందని, ఈ చుట్టుపక్కల ఉన్న మండలాల వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుండి కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులకు ఈ రోడ్డు అత్యంత సమీప మార్గం కాబోతోందని,

ఈ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పలు చోట్ల కల్వర్టులను కూడా నిర్మించబోతున్నామన్నారు. గత 7 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం 20 వేల కో ట్లకుపైగా కేంద్ర నిధులు తీసుకొస్తే, అందు లో రోడ్ల నిర్మాణం కోసం 7 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేశామన్నారు. 2 వేల 147 కోట్లు నిధులతో కరీంన గర్-వరంగల్ నేషనల్ హైవే, 578 కోట్ల రూపాయలతో ఎల్కతుర్తి-సిద్దిపేట నేషనల్ హైవే పనులు చేపట్టి శరవేగంగా పూర్తి చేయిస్తున్నామని, కరీంనగర్, జగిత్యాల ప్రజల చిరకాల వాంఛ గా ఉన్న కరీంనగర్- జగిత్యా ల రోడ్డు విస్తరణ పనుల విషయంలో రకరకాల కారణాలవల్ల కొంత జాప్యం జరిగిం దని, దాదాపు 2 వేల కోట్ల నిధులతో ఈ జాతీయ రహదారి పనులకు అతి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నామన్నారు

సిఆర్‌ఐఎఫ్ నిధులను సైతం పెద్ద ఎత్తున కరీంనగర్ పార్లమెంట్ కు తీసుకొచ్చామని, గతంలో తె లంగాణ మొత్తానికి 800 కోట్ల సీఐఆర్‌ఎఫ్ నిధులు మంజూరైతే... అందులో ఒక్క కరీంనగర్ పార్లమెంట్ కే 291 కోట్లు తీసుకొచ్చి 1341 కిలోమీటర్ల మేరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రోడ్లను ని ర్మించామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 400 కోట్లకుపైగా సీఐఆర్‌ఎఫ్ నిధులు తీసుకువచ్చామని తెలిపారు. అట్లాగే జాతీయ ఉ పాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు దా దాపు 700 కోట్ల రూపాయల నిధులను మ న పార్లమెంట్ పరిధిలో ఖర్చు చేశామని, గ్రా మీణ సడక్ యోజన పథకం కింద దాదాపు 130 కోట్లు ఖర్చు చేసి రోడ్లు నిర్మించామన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధి కో సం ఇంకా పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తామని, గ్రామగ్రామాన, గల్లీగల్లీలో రోడ్లు వే యిస్తామన్నారు. ప్రజల అభివ్రుద్ధే నా లక్ష్యం, అందుకోసం రాజకీయాలకు అతీతంగా అం దరిని కలుపుకుంటూ పార్లమెంట్ అభివ్రుద్ధికి క్రుషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్, బీఆ ర్‌ఎస్ అనే వివక్ష లేకుండా ఓటేసిన ప్రజల ఆకాంక్ష మేరకు చేయి చేయి కలుపుదాం... కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం.. కలిసి రావాలని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను, నాయకులను కోరుతున్నానని బండి సంజయ్ కుమార్ తెలిపారు.