calender_icon.png 11 July, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమిలి ఎన్నికలతోనే అభివృద్ధి సాధ్యం

27-05-2025 12:00:00 AM

వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు

కుమ్రం భీం ఆసిఫాబాద్,మే26( విజయ క్రాంతి): జమిలి ఎన్నికలు జరుగుతునే దేశం మరింత అభివృధి లో ముందుకు వెళ్లుతుందని వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలంతో కలిసి ఉద్యోగులు, మేధావులు, వ్యాపారస్థులు, న్యాయవాదులు ఉపాధ్యాయులు విద్యార్థు లతో పాటు పలు వర్గాలతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం చేపడుతు న్న ఎన్నికల విధానం ద్వారా ఆర్థిక భారం పడుతుందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక చేపట్టడం ద్వారా ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుందని, అభివృద్ధిలో దేశం ముందుకు వెళ్లుతుందన్నారు. 

ఒకే దేశం ఒకే ఎన్నికపై వారి నుండి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్ర మంలో భాజపా నాయకులు అరిగెల మల్లికార్జున్, కోట్నాక విజయ్, సొల్లు లక్ష్మి, దీపక్ రావ్, ప్రసాద్ గౌడ్, సుంకరి పెంటయ్య, తదితరులు ఉన్నారు.