calender_icon.png 11 July, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ పాద ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు భోజనం ఏర్పాటు సంతోషకరం

26-05-2025 10:49:24 PM

రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..

మంథని (విజయక్రాంతి): శ్రీ పాద ట్రస్ట్ ఆధ్వర్యంలో కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు లక్షల్లో వస్తున్న భక్తులకు కాటారం కొయ్యూరులో ఉచిత భోజనం ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. సోమవారం సరస్వతి పుష్కరాల్లో భాగంగా సరస్వతి పుష్కర స్నానం ఆచరించడానికి రాష్ట్ర నలుమూలల నుండి వస్తున్న యాత్రికుల కోసం భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు, శ్రీపాద ట్రాస్టు చైర్మన్ శ్రీనుబాబు ఆదేశాలతో కాటారంలో ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్హర్ రావు మాజీ జెడ్పిటిసి అయిత కోమల రాజిరెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.