calender_icon.png 11 July, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

26-05-2025 10:45:22 PM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) మాసాయిపేటలోని శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. రైల్వే పట్టాలపై మృతుదేహాన్ని గమనించిన స్థానికులు కామారెడ్డి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు, విషయం తెలుసుకున్న కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే కామరెడ్డి రైల్వే పోలీసులను సంప్రదించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.