07-02-2026 01:55:51 AM
ఆశీర్వదించండి...అభివృద్ధి చేస్తా: 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఎరుకలి రవి
జిన్నారం/అమీన్ పూర్, ఫిబ్రవరి 6: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు వేసి గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిన్నారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కాలాల్ రాజగౌడ్ తెలిపారు. శుక్రవారం 13వ వార్డు మంత్రి కుంటలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి గడపగడప ప్రచారం జోరుగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ 10 ఏళ్ళు మంత్రి కుంటకు చేసింది ఏమీ లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు, గృహ జ్యోతి, రైతు రుణమాఫీ, ఫ్రీ బస్ అనేక పథకాలతో ముందుకు సాగుతుందన్నారు. మంత్రి కుంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు ఎల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే గ్రామ అభివృద్ధికి నిధులు వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సహకారంతో 13వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఆశీర్వదించి తమకు ఓటు వేస్తే అందుబాటులో ఉండి సేవలు అందిస్తామన్నారు. 13వ వార్డు అభ్యర్థి ఎరుకలి రవి మాట్లాడుతూ మంత్రి కుంట మాదారం అంబేద్కర్ కాలనీ ప్రజలే నా బలం బలగమని, ఆదరించి ఆశీర్వదిస్తే అభివృద్ధి మీ గుమ్మం ముందు చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సీతారాం సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీతారాం యాదవ్, నర్సింగరావు, వీరేష్, లక్ష్మణ్ యాదవ్, నరసింహ, రాజు ముదిరాజ్, బాలరాజు, శివ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.