calender_icon.png 7 February, 2026 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే.. ఒక్కో వార్డు రూ.8 కోట్లతో అభివృద్ధి

07-02-2026 01:52:43 AM

టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జయా చైతన్యరెడ్డి

సంగారెడ్డి, ఫిబ్రవరి 6(విజయక్రాంతి):సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, నాయకులకు, కార్యకర్తలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దిశా నిర్దేశం చేస్తుంటే మరో వైపు జగ్గారెడ్డి కూతురు, యూత్ కాంగ్రెస్ జెనరల్ సెక్రటరీ జయారెడ్డి ఇంటిటి ప్రచారంతో సంగారెడ్డి పట్టణాన్ని చుట్టేస్తున్నారు. ఇంకోవైపు డీసిసి అధ్యక్షురాలు, టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఉదయం నుండి రాత్రి వరకు అందుబాటులో ఉంటూ ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నారు.

జయా చైతన్య రెడ్డి శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని 1,2,3 వా ర్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, మీ గల్లీ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు.

జగ్గారెడ్డి లాంటి నాయకుడు చాలా అరుదుగా ఉంటారని, అంతటి నాయకుడు మీకు అండగా ఉన్నాడని, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి ఆదరించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశా రు. డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పట్టణం లో 17 వ వార్డు తో పాటు సదాశివపేట పట్ట ణం లోని ఒకటవ వార్డులో  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రానున్న మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, ప్రజలు ఆలోచించి ఓటేయాలని సూచించారు.