19-01-2026 12:08:23 AM
మహబూబ్ నగర్ టౌన్, జనవరి 18: ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గౌరవ అధ్యక్షులు సంఘ విశ్వనాథ్ అన్నా రు. ఆదివారం తొగట వీర క్షత్రియ సేవా సంఘం నేతలు, జిల్లా కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరీ దేవి దేవాలయ కమిటీ ఆలయంలో నూతన కార్యవర్గ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరు అందరికీ మేలు చేసేలా అవసరమైన చర్య లు తీసుకోవాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్న సవిధానంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని తెలియజేశారు. అధ్యక్షులుగా కొంత చంద్రమౌళి, ఉపాధ్యక్షులుగా రంగం చౌడయ్య, బాలరాజు, గుర్రం బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా చింత నాగరాజు లతో పాటు పలువురుని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.