19-01-2026 12:07:13 AM
చిన్నంబావి, జనవరి18: చెల్లెపాడు (వెంకటాంపల్లి) గ్రామానికి చెందిన కోటకొండ పురేందర్ అయ్యవారి పల్లి ప్రభుత్వ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 2002- 2003 లో పదో తరగతి చదివాడు.ఇటీవల అనారోగ్యంతో అతను మరణించాడు. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు ఆదివారం ఆయన చిత్రపటానికి నివాళులర్పించి సేకరించిన మొత్తం నగదును గ్రామ సర్పంచ్ కోటకొండ పెద్ద నరసింహ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎస్.లోకేష్, సురేష్, కురుమయ్య,స్వాములు,చక్రవర్తి, రాముడు,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.