19-01-2026 12:09:48 AM
నాగర్ కర్నూల్ జనవరి 18 ( విజయక్రాంతి): తపాలా ఉద్యోగులు తమ సమస్యల సాధనకు సంఘటితంగా పోరాడాలని ఆల్ ఇండియా తపాలా ఉద్యోగుల సంఘం సర్కిల్ కార్యదర్శి శ్రవణ్ కుమార్, గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం సర్కిల్ కార్యదర్శి బండి జయరాజు పిలుపునిచ్చారు. ఆది వారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్ లో వనపర్తి డివిజన్, గ్రామీణ తపాలా ఉద్యోగుల ద్వైవార్షిక మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, తపాలా శాఖ ప్రైవేటీకరణ య త్నాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని నేతలు పేర్కొన్నారు. మహాసభల్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొని, గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు.