calender_icon.png 2 February, 2026 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెబ్బేరు పట్టణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

02-02-2026 12:31:49 AM

జిల్లా అధికార ప్రతినిధి కంచ ఆంజనేయులు

పెబ్బేరు పీబ్రవరి 1: పెబ్బేరు పట్టణ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమవుతుందని జిల్లా అధికార ప్రతినిధి కంచి ఆంజనేయులు అన్నారు. ఆదివారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. 10 మంది అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు. రెండో వార్డుకు గౌని శైలజ, 3లో గోనెల అరవింద్, 4లో దూపం సునిత, 5లో కంచె జ్యోతి, 6లో తిమ్మనగారి కృష్ణవేణి, 7లో గంధం శివ, 8లో రంగస్వామి గౌడ్, 9లో క్రాంతి కుమార్ నాయుడు, 10వ వార్డుకు మానపాడు రా ములు, 11వ వార్డుకు జీ. శ్వేతలను ఖరారు చేసినట్లు తెలిపారు. దాదాపు రెండు నెలల ముందు నుంచే బీజేపీ ఆధ్వర్యంలో వార్డుల్లో పర్యటించి మోదీ ప్రవేశపెట్టి అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పారు.

ఇంటింటికీ తిరిగి వార్డుల్లో నెలకొన్న సమస్యలను, ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న కష్టాలను నోట్ చేసుకున్నామని అన్నారు. ముఖ్యంగా పట్టణంలో ప్రతి వార్డులో తాగు నీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపిని గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఒక్కసారి తమకు అవకాశం కల్పించాలని, తమ సత్తా ఎంటో చూపించి ప్రజల మన్ననలను గెలుచుకొని తీరతామని వారు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు హేమా రెడ్డి, నాయకులు రాఘవేందర్ గౌడ్, సర్వేశ్వర్ గౌడ్, వెంకట్రామ్ రెడ్డి, కార్తిక్, భరత్, మహేష్, శివ, తదితరులు పాల్గొన్నారు.