02-02-2026 12:32:32 AM
కరీంనగర్, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండగా ప్ర ధాన పార్టీల ఆశావహుల్లో టికెట్ల పోటీ తీ వ్రంగా ఉండడంతో ‘బీ‘ ఫాంలపై ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ కార్పొరేషన్తోపాటు ప లుచోట్ల ఒక్కో డివిజన్, వార్డు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ కు పరుగులు తీస్తున్నా రు. కరీంనగర్ కార్పొరేషన్లో 47 డివిజన్ల అభ్యర్థుల ఎంపిక పూర్తయినప్పటికీ మార్పు లు, చేర్పుల కోసం ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
బీజేపీలో ఐక్యత ఉండాల ని, టికెట్లు వచ్చిన వారికి మద్దతుగా పోటీలో ఉండేవారు తప్పుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఆయన ఈ మేరకు ఆదివారం తన స్వంత డివిజన్ నుండి బుజ్జగింపుల పర్వం మొదలు పెట్టారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ బుజ్జగింపులు ప్రారంభించి ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ నుండి 309 మంది, బీఆర్‌ఎస్ నుండి 252 మంది, బీజేపీ నుండి 374, ఎంఐఎం నుండి 55 మంది ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. హుజూరాబాద్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా కాంగ్రెస్ నుంచి 80, బీఆర్‌ఎస్ నుంచి 17, బీజేపీ నుంచి 80 మంది దాఖలు చేశారు. జమ్మికుంటలో 30 వార్డులు ఉండగా కాంగ్రెస్ నుంచి 80, బీఆర్‌ఎస్ 84, బీజేపీ నుంచి 74 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
చొప్పదండిలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 28, బీఆర్‌ఎస్ 35, బీజేపీ 31 నామినేషన్లు దాఖలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీలో 429, వేములవాడలో 200 మంది ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్లో 60 డివిజన్లలో 452 మంది 693 నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ నుంచి 154 మంది, బీఆర్‌ఎస్ నుంచి 109, బీజేపీ నుంచి 80, బీఎస్పీ నుంచి 20, టీడీపీ నుంచి ఒక్క నామినేషన్ దాఖలయింది.
పెద్దపల్లి మున్సి పాలిటీలో 194 మంది బరిలో ఉన్నారు. మంథనిలో 155 నామినేషన్లు దాఖలయ్యాయి. సుల్తానాబాద్ లో 139 నామినేషన్లు వచ్చాయి. జగిత్యాల జిల్లా తీసుకుంటే జగిత్యాల మున్సిపాలిటీలో 532 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో కాంగ్రెస్ 141, బీజేపీ 124, బీఆర్‌ఎస్ 102, ఎంఐఎం నుంచి 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ధర్మపురిలో 15 వార్డులు ఉండగా 113 నామినేషన్లు దాఖలయ్యాయి. రాయికల్లో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ నుంచి 26, బీఆర్‌ఎస్ నుంచి 18, బీజేపీ నుంచి 18, జనసేన నుంచి 6 నామినేషన్లు దాఖలయ్యాయి.
మెట్పల్లి 291 నామినేషన్లు దాఖలయ్యాయి. కోరుట్లలో 33 వార్డులకు 190 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం తిరస్కరించబడిన అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను ఆదివారం స్వీకరించి తుది జాబితాను సోమవారం ప్రకటి స్తారు. మంగళవారం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంరణ గడువు ఉంది. ఈలోగా ఆయా పార్టీల అభ్యర్థులు బీ ఫారాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఈ మేరకు ఆశావహులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ టికెట్ల వేట ముమ్మరం చేశారు. చాలామంది టికెట్లు రాకుంటే స్వతంత్రంగానైనా, ఇతర పార్టీల బీ ఫాంలతోనైనా పోటీ చేసేందుకు సిద్ధమవుతుండడంతో పలు డివిజన్లలో రెబల్స్ బెడద ఉండే అవకాశం ఉంది.