calender_icon.png 2 February, 2026 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత సంతాన సాఫల్య వైద్యశిబిరం ప్రారంభం

02-02-2026 12:30:36 AM

కరీంనగర్ క్రైమ్ ఫిబ్రవరి1 (విజయ క్రాంతి): ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన మరియు ప్రముఖ సంతాన సాఫ ల్య కేంద్రమైన రజిని ఫెర్టిలిటీ సెంటర్లో శ్రీ లక్ష్మీ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా నిర్వహించే ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని ఘనంగా ప్రారంభించ డం జరిగింది దానిలో భాగంగా రెనే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత ప్రో.డాక్టర్ బంగారి స్వామి వారి సతీమణి రజనీ ఫెర్టిలిటీ సెం టర్ చైర్ పర్సన్, సీనియర్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డా.బంగారు రజిని ప్రియదర్శిని జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా డా.రజనీ ప్రియదర్శిని మా ట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఈ ఉచిత ఇన్ఫర్టిలైటీ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని క్యాంప్ కి వచ్చే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుందని తద్వా రా మనలో ఇన్ఫెర్టిలైటీ సమస్య ఏవిధంగా పెరుగుతుందో గమనించాలని, దీనికి మనందరం ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా అధిగమించాలని, సరైన ఆరోగ్యకరమైన ఆహారం, రోజూ వ్యాయామం చేయడం, చె డు అలవాట్లైన మద్యం, పొగాకులకు దూ రంగా ఉండడం చేయాలని అన్నారు.

ఈ ఉచిత వైద్య శిబిరం 1/02/2026 నుండి 28/ 02/2026 వరకు నిర్వహిస్తున్నామని, దీని లో నమోదు చేసుకున్న వారినుండి లక్కీ డ్రా ద్వారా పది మంది దంపతులను ఎంపిక చే సి వారికి ఉచితంగా ఐ వి ఎఫ్ చికిత్సను అం దించడం జరుగుతుందని అన్నారు. ఈ విధంగా గత 5 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని భవిష్యత్తులో కూడా ప్రతి ఏడు నిర్వహిస్తామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నా రు.

ఈ సమావేశ ముఖ్య అతిథి ప్రో.డా.బం గారి స్వామి గారు మాట్లాడుతూ తన తల్లిగారైన కీ.శే.బంగారి లక్ష్మి గారి స్మారకార్థం ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని దాంట్లో భాగంగా ఉచిత కీలు మార్పిడి వైద్య శిబిరం కూడా వచ్చే ఏప్రిల్ నెలలో ఏర్పాటు చేస్తామని అన్నారు. చిన్నతనంలోనే మేము తండ్రిని కోల్పోయినా కూడా మా అందరినీ ఉన్నత విద్య వంతుల్ని చేయడంలో మా తల్లిగారి పాత్ర మరువలేనిది అని,మాకు మంచి విలువలతో కూడిన విద్యా బుద్దులను మాకు నేర్పించడం ఆమె చలవే అని అన్నారు.

మా జీవితం పూర్తిగా వైద్య సేవకే అంకితం అని వైద్య రంగంలో వచ్చే ప్రతి ఆధునిక మార్పులను తాము ఎ ప్పటికప్పుడు గమనిస్తూ పేషెంట్లకు ఎప్పటికప్పుడు తగిన మార్పుల ద్వారా ఆధునిక వై ద్య విధానాలు అమలు చేయడంలో ఉత్తర తెలంగాణలోనే రెనే హాస్పిటల్స్ ముందుంటాయని అన్నారు. రాబోయే నెలలో ఉచిత రోబోటిక్ కీలు మార్పిడి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని అందులోనుండి సుమారు 15 మంది అర్హులైన నిరుపేద పేషెంట్లను గుర్తిం చిడ్రా ద్వారా వారికి పూర్తి ఉచితంగా కీలు మార్పిడి వైద్య చికిత్సను అందజేస్తామని తె లిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ గుం డె వైద్య నిపుణులు డా.సురేష్ కుమార్, ఎం బ్రియలాజిస్ట్ డా. రాజేందర్, స్త్రీల వైద్య నిపు ణులు డా. ఫర్హానాజ్, డా.మౌనిక, డా.సాయి శ్రీ, డా.సౌఖ్య, హాస్పిటల్ నాన్ క్లినికల్ డైరెక్ట ర్ అరవింద్ బాబు, జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్ బయో మెడికల్ ఇంజనీర్ రతన్ లతో పాటు హాస్పిటల్ సిబ్బంది మరియు మొదటి రోజు శిబిరానికి వచ్చిన సుమారు 120 మంది పేషెంట్లు పాల్గొన్నారు.