వెయ్యి రోజుల పాలనలో తుంగతుర్తి అభివృద్ధి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేగటి రవిగౌడ్
తుంగతుర్తి, సెప్టెంబర్ 3 : వెయ్యి రోజుల ప్రజాపాలన(People Governance)లో తుంగతుర్తి నియోజకవర్గం(Tungaturthi Constituency) గతంలో జరగనంత అభివృద్ధి జరిగిందని తుంగతుర్తి కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడు రేగటి రవి గౌడ్(Regati Ravi Goud) అన్నారు. గురువారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రేగటి రవి గౌడ్,తిరుమలగిరి మండల కమిటీ అధ్యక్షుడు సుంకరీ జనార్ధన్, సింగల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, జిల్లా నాయకులు ఎల్సోజు నరేష్ మాట్లాడుతూ వెయ్యి రోజుల పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఈ నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి చేశారన్నారు.
గత 60 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి గా మద్దిరాల, నూతనకల్ మండలాల రైతులకు సుమారు 3000 ఎకరాల భూమి పట్టాలు ఇప్పించిన ఘనత ఎమ్మెల్యే సామెల్ ది అన్నారు. ఈ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.
ఇప్పటికైనా కళ్ళు తెరిచి బిఆర్‌ఎస్ నాయకులు ప్రజా పాలనను చూసి బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గుగులోతు స్వాతి భాస్కర్, గుగులోతు జ్యోతి రాము,జిల్లా నాయకులు మారగాని వెంకటయ్య, గ్రంధాలయ చైర్మన్ గంగరాజు,పోలేపాక రామచంద్రు, భాష బోయిన వెంకన్న నాయకులు పాల్గొన్నారు.






