4 September, 2026 | 7:05 AM

సభా సమరానికి బీఆర్‌ఎస్!

04-09-2026 | 05:55am
  1. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై లెక్కలే అస్త్రం
  2. ఆరు గ్యారంటీల నుంచి అప్పుల దాకా ఎజెండా రెడీ 
  3. రైతులు, నిరుద్యోగులు, మహిళల సమస్యలపై ఫోకస్  
  4. ప్రజాక్షేత్రంలో లెవనెత్తిన ప్రతి అంశం సభలోకి
  5. అంశాలవారీగా సర్కార్‌ను నిలదీసే వ్యూహం
  6. ప్రజాక్షేత్రంతో పాటు అసెంబ్లీలోనూ ఒత్తిడి పెంచేలా ప్లాన్   

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాం తి) : అసెంబ్లీ సమావేశాలు(Assembly meetings) ఈ నెల 7నుంచి ప్రారంభం కానునుండటంతో రాజకీయ వేడీ మరింత పెరగనుంది. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ సమావేశాలను కీలక వేదికగా మలుచుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్(BRS) సమాయత్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకు న్న నేపథ్యంలో.. ఎన్నికల హామీలు(election promises), అమలైనవి, పెండింగ్(pending).. తదితర అంశాలను లేవనె త్తాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఆందోళనలు, పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్.. వాటిని అసెంబ్లీలోకి తీసుకెళ్లాల ని యోచిస్తోంది. ప్రజల్లో లేవనెత్తిన ప్రతి అంశాన్ని సభలో అధికారిక చర్చగా మార్చడమే బీఆర్‌ఎస్ వ్యూహంలో కీలకంగా కనిపి స్తున్నది. బయట చేసిన ఆందోళనలు, ప్రజా కార్యక్రమాలు, ప్రభుత్వంపై చేసిన విమర్శల కు అసెంబ్లీ వేదికగా మరింత పదును పెట్ట డం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని యోచిస్తోంది.

ప్రభుత్వ స్పందనను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్‌పై రాజకీయ ఒత్తిడి పెంచాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని బీఆర్‌ఎస్ రాజకీయంగా కీలకమైన అవకాశంగా చూస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇ చ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన త ర్వా త వాటి అమలు తీరు, ప్రస్తుతం రాష్ట్ర ంలో నెలకొన్న పరిస్థితులను పోల్చుతూ ఇప్పటికే బీఆర్‌ఎస్ ప్రజల్లోకి వెళ్లింది.

ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారనే దానికంటే.. ఏ హామీకి ఎంత కేటాయించారు? ఎంత ఖర్చు చేశారు? ఎంతమంది లబ్ధి పొందారు? ఇంకా ఎంతమంది ఎదురుచూస్తున్నారు? అనే గణాంకాల ఆధారంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు  సిద్ధమవుతోంది.వెయ్యి రోజుల పాలనపై రూపొంది ంచిన చార్జ్‌షీట్‌ను కూడా అసెంబ్లీ చర్చలకు అనుసంధానం చేసే అవకాశం ఉంది. 

పాలనా వైఫల్యాలపై ప్రభుత్వంపై ఒత్తిడి

కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన ఆరు గ్యారంటీలను(Six guarantees) బీఆర్‌ఎస్ ప్రధా నంగా ముందుకు తీసుకురానున్నది. మహిళలు, రైతులు, యువత, పేదలు, గృహ ని ర్మాణం, విద్యుత్ తదితర అంశాలకు సంబంధించిన హామీల అమలుపై ప్రశ్నలను సం ధించనుంది. రైతు సమస్యలను అసెంబ్లీలో విస్తృతంగా ప్రస్తావించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. రైతు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, పంటల కొనుగోళ్లు, ఎరు వుల లభ్యత, సాగునీరు, వ్యవసాయ విద్యు త్, పంట నష్టపరిహారం వంటి అంశాలను ప్రభుత్వం ముందుంచే అవకాశం ఉంది.

రుణమాఫీపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలు, వాస్తవంగా ప్రయోజనం పొందిన రైతుల స ంఖ్య, ఇంకా అర్హత ఉన్నప్పటికీ మాఫీ అం దని రైతుల పరిస్థితి వంటి అంశాలతోపాటు రైతుభరోసా చెల్లింపులపై కూడా ప్రశ్నించనున్నది. రెండు లక్షల ఉద్యోగాల హామీ, జాబ్‌క్యా లెండర్, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ లు, నియామక పరీక్షలు, నోటిఫికేషన్లు, ఉద్యోగ నియామకాల వేగం వంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తున్నది.

మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్ర యాణం, గ్యాస్ సిలిండర్ వంటి హామీలు కూడా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మహిళల ఓట్లను కీలకంగా భావించిన కాంగ్రెస్.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందన్న అంశాన్ని రాజకీయంగా ముందుకు తీసుకురానున్నది.

విద్యార్థుల సమస్యలు కూడా అసెంబ్లీ అజెండాలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి లు, స్కాలర్షిప్‌లు, గురుకులాలు, ప్రభుత్వ విద్యా సంస్థల పరిస్థితి వంటి అంశాలను ప్రస్తావించనుంది. పింఛన్లు, సంక్షేమ పథకాలు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, పేదలకు సంబంధించిన పథకాల అమలు తీరుపైనా బీదృష్టి పెట్టనుంది. 

కృష్ణా, గోదావరి జలాల అంశం 

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన కృష్ణా, గోదావరి జలాల అంశాన్ని కూడా బీఆర్‌ఎస్ అసెంబ్లీలో బలంగా లేవనెత్తాలని యోచిస్తోంది. 

కృష్ణా జలాల పంపకాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్, కేఆర్‌ఎంబీ వ్యవహారాలు, ఆంధ్రప్రదేశ్‌తో నీటి వివాదాలు, తెలంగాణకు రావాల్సిన వాటా వంటి అంశాలపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇటీవల నీటి పంపకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కేంద్రం వద్ద రాష్ట్రం చేసిన వాదనలు, పొరుగు రాష్ట్రంతో చర్చలు వంటి అంశాలను కూడా సభలో ప్రస్తావించేందుకు సిద్ధమవుతోంది.

కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, మరమ్మతులు, పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టుల పురోగతిపై కూడా బీఆర్‌ఎస్ ప్రశ్నలు సంధించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా, విద్యుత్ కొనుగోళ్లు, డిస్కంల ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వంటి అంశాలతోపాటు విద్యుత్ సరఫరాలో లోపాలు, రైతులకు ఎదురవుతున్న సమస్యలు, పరిశ్రమలకు విద్యుత్ పరిస్థితి వంటి అంశాలను స్థానిక ఉదాహరణలతో సభలో ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

ప్రజాక్షేత్రం నుంచి అసెంబ్లీ వేదికకు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అసెంబ్లీలో కీలక చర్చకు దారితీయవచ్చు. రాష్ట్ర అప్పులు, వాటిపై వడ్డీ భారం, కొత్తగా తీసుకుంటున్న రుణాలు, వాటి వినియోగం, ఆదాయ-వ్యయాల పరిస్థితి వంటి అంశాలను బీఆర్‌ఎస్ ప్రశ్నించనుంది. ప్రభుత్వం గత బీఆర్‌ఎస్ పాలనలోని అప్పులను ప్రస్తా విస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా తీసుకున్న అప్పులు, వాటి వినియోగం, అభివృద్ధి ప్రాజెక్టులకు చేసిన వ్యయం వంటి అంశాలను బీఆర్‌ఎస్ ఎదురు దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

మూసీ ప్రాజెక్టు, హైడ్రా, చెరువుల పరిరక్షణ, భూవ్యవహారాలు, మెట్రో, నగర మౌలిక వసతులు, ట్రాఫిక్, ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటి అంశాలు చర్చకు తీసుకొచ్చి భారీ ప్రాజెక్టులకు అయ్యే వ్యయం, నిధుల సమీకరణ, భూసేకరణ, నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరే అవకాశం ఉంది. ప్రతిపక్షంగా సభా సమయాన్ని పూర్తిగా వినియోగించుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురా వాలని యోచిస్తున్నది. 

ఇప్పటికే ప్రభుత్వ పాలనపై ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్.. ప్రస్తుతం అసెంబ్లీ వేదికగా కూడా నిలదీయడంతోపాటు ప్రభుత్వ పనితీరు ను ప్రజల ముందు ఉంచాలనే వ్యూహ రచన చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని బీఆర్‌ఎస్ సాధారణ రాజకీయ విమర్శలకే పరిమితం చేయకుండా.. అసెంబ్లీని సమగ్ర రాజకీయ వేదికగా ఉపయోగించుకోవాలని చూస్తోంది.