26 April, 2026 | 7:42 AM

ఓటమి భయంతోనే ఫేక్ ప్రచారం

10-05-2024 02:54 AM

కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం

సంగారెడ్డి రోడ్డుషోలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సంగారెడ్డి, మే 9 (విజయ క్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెపుతారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం సంగారెడ్డి పట్టణంలో మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు షో నిర్వహించి ప్రసగించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ సమావేశానికి ప్రజలు రాక సభ వెలవెల బోయిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్‌రాంరెడ్డిని గెలుపించాలన్నారు. రోడ్డు షోలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్, మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్‌రాంరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.