26 April, 2026 | 3:18 AM

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం

26-04-2026 02:03 AM
  1. ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనలేదు
  2. దళారులకు లాభం చేకూర్చేందుకే రైతుల పట్ల నిర్లక్ష్యం
  3. మద్దతు ధర రూ.2,350 నిర్ణయించాలి
  4. అన్నదాతలకు అండగా ఉండి పోరాటం చేస్తాం 
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వుంట్ల తారక రామారావు  
  6. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి కొనుగోలు కేంద్రం సందర్శన

సిరిసిల్ల, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లో తమ పార్టీ  కార్యకర్తలు రైతుకు అండగా నిలిచి పోరాటం చేస్తారని హెచ్చరించారు. ధాన్యం క్వింటాల్‌కు రూ.2,350లు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. శనివారం కేటీఆర్ సిరిసి ల్లలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన తం గళ్లపల్లి మండలం బద్దెనపల్లి కొనుగోలు కేంద్రాలని సందర్శించి రైతుల ధాన్యం కొనుగోళ్లపై వివ రాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ నెల రోజులుగా రైతులు వడ్లను కేంద్రాలకు తీసుకువస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొంటే మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లు చేయడం లేదని ఆరోపించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు వెయ్యి టన్నుల వడ్లు కూడా కొనలేదని తెలిపారు. రాష్ట్రం లో రైతులకు రైతు బంధు లేదు, సరిపడా విద్యుత్ సరఫరా లేదు, సమయానికి వడ్లు కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. భూ యజమానులకు ఇచ్చినట్లే కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అమలు కాలేదని ధ్వజ మెత్తారు.

రైతు కూలీలకు రూ.వెయ్యి ఇస్తామని చెప్పిన వాగ్దానం కూడా నెరవేర్చలేదని విమర్శించారు. వడ్ల కొనుగోళ్ల కోసం వెంటనే కాంటాలను ఏర్పాటు చేసి, రైస్ మిల్లులకు కేటాయించాలని, రూ.500ల బో నస్‌తో కలిపి కనీస మద్దతు ధరను రూ.2,350 లుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఎల్ నినో ప్రభావంతో అకాల వర్షాలు పడే అవకాశం ఉందని, వెంటనే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోతే రైతుల ధాన్యం తడిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే రైతులు తమ ఖర్చుతో టార్పాలిన్ కవర్లు కొనుగోలు చేసి ధాన్యాన్ని కాపాడుకునే పరిస్థితి నెలకొందని,రైస్ మిల్లులు కేటాయించకపోతే ఎవరు కొనుగోలు చేస్తారు? ఎలా తూకం వేస్తారు? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. దళారులకు లాభం చేకూర్చేందుకే రైతులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.అధికారులను అడిగితే సిరిసిల్లలో వెయ్యి క్వింటాళ్ల వడ్లు కూడా కొనలేదని చెప్పినట్లు తెలిపారు.

మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా మోసం చేసిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత దారుణమైన పాలన ఎప్పుడూ చూడలేదని కేటీఆర్ విమర్శించారు.రాష్ట్రంలోని  రైతులను కలిసి వారి సమస్య లపై ఉద్యమం చేపడతామని వెల్లడించారు. కాం గ్రెస్ పాలనలో రైతాంగం అష్ట కష్టాలు పడుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు.ఎన్నో హామీలు ఇచ్చి అన్ని రకాలుగా రైతులను మోసం చేస్తున్నదన్నా రు. ఇంకో రెండేళ్లు ఆగితే వచ్చేది మన సర్కారేనని, అప్పుడు అందరినీ ఆదుకుంటామన్నారు.