26 April, 2026 | 3:09 AM

భారీగా ఐఏఎస్‌ల బదిలీ

26-04-2026 01:41 AM
  1. పాలనా అవసరాల దృష్ట్యా కీలక మార్పులు 
  2. పలువురికి కొత్త బాధ్యతలు

హైదరాబాద్, ఏప్రిల్ 25(విజయక్రాంతి): తెలంగాణ ప్రభు త్వం పాలనా అవసరాల దృష్ట్యా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు చేపట్టింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా సీనియర్ అధికారుల నుంచి మధ్యస్థాయి అధికారుల వరకు పలు కీలక విభాగా ల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది.

పాలనా అవసరాల దృష్ట్యా ఈ మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్‌ను ఢిల్లీ తెలంగాణ భవన్‌కు ప్రత్యేకాధికారిగా బదిలీ చేశారు. ఎం. దానకిషోర్ పీఆర్ అండ్ ఆర్డీ, ఆర్‌డ బ్ల్యూఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, బి. విజయేంద్ర ఎస్సీడీ విభాగ సెక్రటరీగా నియమిస్తూ అదనపు బాధ్యతలు అప్పగించారు.

హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరిని ఎల్‌ఈటీ అండ్ ఎఫ్ శాఖ సెక్రటరీగా బదిలీ చేశారు. కృష్ణ ఆదిత్య ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖ స్పెషల్ సెక్రటరీ, హనుమంత్ కొండిబాను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ, సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యను ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సెక్రటరీ, ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్, నాగర్‌క ర్నూల్ అదనపు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ లాల్ సివిల్ సప్లయిస్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

జీ ముకుందరెడ్డి జీహె చ్‌ఏంసీ గోల్కొండ జోనల్ కమిషనర్ పదవి నుంచి ఐ అండ్ పీఆర్ శాఖలో స్పెషల్ కమిషనర్‌గా, అపూర్వ్ చౌహాన్‌ను జీహెచ్‌ఏంసీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ పదవి నుంచి సీసీఎల్‌ఏ కార్యాలయంలో సీఎంఆర్‌ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.

పీ ఉదయ్ కుమార్-గోల్కొండ జోనల్ కమిషనర్, బాదావత్ సంతోష్-ఖైరతాబాద్ జోన ల్ కమిషనర్, నారాయణ అమిత్ మా లెంపాటి-సర్లింగంపల్లి జోనల్ కమిషనర్, వికాస్ మహతో-ఎల్.బి.నగర్ జో నల్ కమిషనర్, మయాంక్ సింగ్-కూకట్‌పల్లి జోనల్ కమిషనర్, ఏస్ శ్రీనివాస్ రెడ్డి-రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

జిల్లాల కలెక్టర్ల బదిలీలు..

భవేశ్ మిశ్రాను నిర్మల్ కలెక్టర్‌గా, ప్రియాంక అలా హైదరాబాద్, ప్రతీక్ జైన్ సంగారెడ్డి, దివాకర్ టీఎస్ ఖమ్మం, హేమంత్ సహదేవరావ్ ములుగు,  సీ ప్రియాంక నారాయణపేట, హేమంత కేశవ్ పాటిల్ నాగర్ కర్నూల్ కలెక్టర్లుగా నియమితులయ్యారు.

ఇతర పోస్టింగ్‌లు..

మంద మకరందు-ఐటిడిఏ ఉట్నూ ర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా, లెనిన్ వత్సల్ టోప్పో-ఐటిడిఏ ఏటూరు నాగారం ప్రాజెక్ట్ ఆఫీసర్, కిరణ్మయి కొప్పిశెట్టి - రంగారెడ్డి అదనపు కలెక్టర్, యువరాజ్ మార్మాట్-కుమ్రంబీమ్ ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా నియమితులయ్యారు.