18 June, 2026 | 1:28 AM

పార్కులో అభివృద్ధి పనులు

18-06-2026 12:00 AM
  1. వనస్థలిపురం ఫేజ్ --1 కాలనీలో ఆలయాభివృద్ధి
  2. పార్కు, ప్రజా గ్రంథాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం

ఎల్బీనగర్, జూన్ 17 : వనస్థలిపురంలోని ఫేజ్ -1 కాలనీలో డంపింగ్ యార్డుగా పార్కు విముక్తి కానున్నది. కాలనీవాసులు, మున్సిపల్ అధికారులతో కలిసి పార్కులో అభివృద్ధి పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఎన్నో రోజులుగా కాలనీవాసులు ఎదురుచూస్తున్న  ‘మన కాలనీ  మన గుడి  మన పార్క్  మన గ్రంథాలయం‘ అనే లక్ష్యంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

వనస్థలిపురం ఫేస్-1 నివాసితుల సంక్షేమ సంఘం కమిటీ, కాలనీవాసుల అభ్యర్థన మేరకు మున్సిపల్ అధికారులు సానుకూలంగా స్పందించి పార్కు, గ్రంథాలయం, పరిసర ప్రాంతాల అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్వచ్ఛత  శుభ్రత కార్యక్రమంలో భాగంగా  గ్రంథాలయ భవనం, టాయిలెట్లను శుభ్రపరిచారు. పార్కులో చెత్తాచెదారాన్ని తొలిగించి, పునరుద్ధరణ పనులు చేపట్టారు. భవనాలకు సున్నం, రంగులు వేసి, గ్రంథాలయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు ప్రారంభించారు.

అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మాణం, శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి సంస్థానం దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, కాలనీ అభివృద్ధి, పార్కు పరిరక్షణ, గ్రంథాలయ పునరుద్ధరణ మరియు దేవాలయ అభివృద్ధికి స్థానిక ప్రజల సహకారం నిరంతరం కొనసాగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి సంస్థానం, వనస్థలిపురం ఫేస్-1 నివాసితుల సంక్షేమ సంఘం చైర్మన్ మల్లావజ్జుల వేంకట మణిశేఖర్, కమిటీ సభ్యులు గాండ్ల అంజయ్య, ఉప్పు వెంకటేష్, రాపోలు పురుషోత్తం, నరేంద్ర కుమార్, జి. సత్యమూర్తి, గాండ్ల సేనయ్య, జి.మహేష్, ఎం.శ్రీనివాసరావు, ఎస్.దిలీప్ రాజన్, సౌజన్య రాజన్, మోహనవంశీతోపాటు కాలనీవాసులు కవిత, మహిపాల్ రెడ్డి, సతీష్, అనంతయ్య, ముఖేష్, షక్రేజార్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ... కాలనీ అభివృద్ధి, పార్కు పరిరక్షణ, గ్రంథాలయ పునరుద్ధరణ, దేవాలయ అభివృద్ధికి స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు.