4 July, 2026 | 10:19 AM

అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి

12-06-2024 12:55 AM

 ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, జూన్ 11: మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆమె నివాసంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎంత వరకు వచ్చాయి.. పనులు ఆలస్యంగా జరగడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలపై కమిషన ర్‌తో పాటు సిబ్బందితో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్ర త్తలు తీసుకుంటూనే అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు.