4 July, 2026 | 11:23 AM

లక్ష్మీనరసింహులకు ఘనంగా నిత్యపూజలు

12-06-2024 12:55 AM

యాదాద్రి భువనగిరి, జూన్ 11 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో మంగళవా రం నిత్యపూజలు సంప్రదాయరీతిలో ఘనం గా నిర్వహించారు. తొలుత లక్ష్మీనరసింహుడికి వేకువజామున సుప్రభాత సేవ, అర్చన లు, అభిషేకం, అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం హోమ పూజలు జరిపి లక్ష్మీనరసింహుల నిత్యకల్యాణం వైభవంగా జరిపారు. సాయంత్రం అలంకార లక్ష్మీనరసింహుల ఉత్సవమూర్తులను తిరువీధుల్లో ఊరేగించి వెండిజోడి సేవ జరిపారు. అదే విధంగా ఆంజనేయుడికి సింధూర అలంకా రం జరిపారు. వడ పప్పు, బెల్లం, అరిసెలతో ప్రత్యేక నివేదన జరిపారు. పెద్దసంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.