26 August, 2026 | 10:41 AM

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

26-08-2026 09:57 AM

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరస సెలవులు రావడంతో వెంకన్న కొండకు భక్తులు భారీగా పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్ని భక్తులతో నిండిపోయి వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. మంగళవారం నాడు తిరుమల శ్రీవారిని 73,285 మంది భక్తులు దర్శించుకున్నారు.  32,334 మంది భక్తులు నిన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి(Lord Sri Venkateswara Swamy) తల నీలాలు సమర్పించుకోగా, రూ.4.39 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం(Srivari Hundi Income) వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

తిరుమల వసతి వివరాలు | 26-08-2026

తిరుమల CRO వద్ద ఆఫ్-లైన్ నమోదు.

రూ.50 & రూ. 100 గదులు: 388 అందుబాటులో ఉన్నాయి / మొత్తం 1,200

రూ.1,000 & రూ.1,523 గదులు: అందుబాటులో లేవు

⏰ సమయం: ఉదయం 7:15 గంటలకు

📞 155257