26 August, 2026 | 10:26 AM

ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు: సీఎం రేవంత్

26-08-2026 09:45 AM

హైదరాబాద్: ప్రవక్త మహమ్మద్ (Prophet Muhammad)జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే పవిత్రమైన మిలాద్-ఉన్-నబీ(Milad un Nabi greetings) సందర్భంగా, ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రపంచానికి ప్రేమ, దయ, కరుణ, సహనం, సోదరభావం వంటి గొప్ప విలువలు బోధించారని, ఆయన సందేశం అందరికీ స్ఫూర్తినిస్తుందని సీఎం పేర్కొన్నారు. హజ్రత్ మహమ్మద్ జీవితం నుండి స్ఫూర్తిని పొందుతూ, పరస్పర సామరస్యంతో జీవిస్తూ దేశ పురోగతి కోసం నిరంతరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మిలాద్-ఉన్-నబీ పర్వదినం అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాన్ని నింపాలని ఆకాంక్షించారు.