మహిళను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు
నీ తాటాకు చప్పుళ్ళకు బెదిరే వారు ఇక్కడ ఎవరూ లేరు
మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
గుండాల, (విజయక్రాంతి): పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లపై అడ్డగోలుగా మాట్లాడటం జరిగిందని, ఇలా మా నాయకుల గురించి నోరు జారితే సహించేది లేదని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైస్ ప్రెసిడెంట్ పొంబోయిన ముత్తయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎస్కే ఖదీర్ లు విలేఖరులతో మాట్లాడుతూ.. రేగా కాంతారావు నీ గతం మొత్తం మాకు తెలుసు మా మీద గానీ, మా నాయకుల మీద గానీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై గానీ బురద చల్లాలని చూస్తే ఊరుకునేది లేదని, నీ వ్యక్తిగత కేసు అది దానికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, పనిగట్టుకుని మాపై బురద చల్లాలని చూస్తున్నావ్ నీ తప్పుడు పనులకు మమల్ని బద్నామ్ చేస్తే ఖాబర్దార్ బిడ్డా అని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు ఒక్కోటి అమలు చేస్తూ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వమని, అలాంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంతన్న గురుంచి నోటికొచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. మీరు నిజంగా తప్పు చేయకపోతే ఇన్ని రోజులు అండర్ గ్రౌండ్లో ఉండాల్సిన అవసరం ఎం వచ్చిందని ప్రశ్నించారు. కేసు పెట్టింది ఒక మహిళ నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే బహిరంగంగా బైటకు వచ్చి ప్రజల ముందు నీ నిజాయితీని నీరూపించుకునే వాడివి కదా, కోర్టులో సాక్ష్యాలు లేకుంటే కేసు చెల్లదని ఇన్ని రోజులు దాక్కుని సాక్షాలన్ని నిర్వీర్యం చేసే పనిలో ఉండి ఈరోజు నేను నిజాయితీపరుడ్ని అని తొడలు కొడుతున్నావ్, మా ముఖ్యమంత్రి రేవంతన్నని అనే అంతటి వాడివా నువ్వు, ఒకప్పుడు నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతోనే ఎమ్మెల్యేగా గెలిచావనే విషయాన్నీ గుర్తుపెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఊకే బుచ్చయ్య, సాయనపల్లి సర్పంచ్ కల్తి కృష్ణవేణి, పడుగోనిగూడెం సర్పంచ్ ఈసం సంజీవరావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు గుర్రం పుష్పరాజ్, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, మండల నాయకులు ఎస్కే అబ్దుల్ నభి, వాంకుడోత్ బీకజి, ఈసం రాజబాబు, భూక్యా శ్రీను, ఎస్కే కాసీం, ఎస్కే వాజీద్ పాషా, బోడ వెంకన్న, ఉప సర్పంచ్ వట్టం కృష్ణారావు, గుండాల పంచాయతీ నాయకులు వాంకుడోత్ రమేష్, పూనెం సావిత్రి, తిర్రి సుగుణ, ఎస్కే ఇస్రార్, బొంగు చంద్రశేఖర్, సనప రాంబాబు, నూనావత్ రవి, పాయం గణేష్, సూర్నబాక కిషన్, వజ్జ ప్రభాకర్, ఇస్లావత్ మోహన్, బానోతు నరేందర్, బానోత్ నరేష్, గడ్డం రాజేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






