26 August, 2026 | 11:06 AM

సొసైటీ సీఈవో మృతి

26-08-2026 10:30 AM

నివాళులర్పించిన ఎల్లారెడ్డి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన వడ్ల విట్టల్ అనారోగ్యంతో మృతి(Society CEO passes away) చెందారు. మృతుడు వడ్ల విట్టల్ నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్ సొసైటీలో,లింగంపేట్ మండల కేంద్రంలో మరియు నల్లమడుగు గ్రామ సొసైటీల సీఈఓలుగా పనిచేశారు. విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ పరామర్శించి మృతి దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.సొసైటీ సీఈవో వడ్ల విట్టల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ దివిటి రాజదాస్,సీనియర్ నాయకులు శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాగా రెడ్డి,యూత్ మహమ్మద్ ఫయీమ్, లింగంపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోకల సాయిరాం,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జైల్ సింగ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీను,మండల ప్రధాన కార్యదర్శి మమ్మద్ ఖలీల్,మైనార్టీ నాయకులు జహీర్,బుర్ర కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.