తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 15 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి కంపార్ట్మెంట్లన్నీ నిండి ఏ.టీ.జీ.హెచ్. క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,964 మంది భక్తులు దర్శించుకోగా, 32,125 మంది భక్తులు తిరుమల వెంకన్నకు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.24 కోట్లు వచ్చినట్లు తిరుమల అధికారులు(TTD) ప్రకటించారు.
నేటి తిరుమల సమాచారం
నేడు తిరుమలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లును ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటా నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.






