22-05-2025 08:55:03 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఉరేసుకుని వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు గోపాల్ అనే వ్యక్తి మద్యానికి బానిసై(Alcohol Addiction) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బయటకు వెళ్లిన కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి గోపాల్ విగతజీవిగా పడిఉన్నాడు. దీంతో వారు ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.