సూర్యక్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే 31: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సూ ర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి ద్వాదశ ఆదిత్యాది క్షేత్రంలో ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. తె ల్లవారుజామున అభిషేకాలు,అర్చనలతో పా టు ప్రత్యేక పూజలు ఉండడంతో ఉదయం నుంచే భక్తుల తాకిడి నెలకొంది.మధ్యాహ్నం యజ్ఞశాలలో మహాసౌర హోమం నిర్వహించారు.
క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీర హ నుమాన్,శ్రీ రామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు.వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి,అన్న ప్రసాద వితరణ జరిపారు.ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవ స్థాపకులు కాకులారపు రజితాజనార్ధన్,నిర్వాహకులు గణపురం నరేష్,ఉప్పల రాజేష్, అర్చకులు భీంపాండే,భక్తులు తదితరులు పాల్గొన్నారు.






