calender_icon.png 12 October, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీవించమ్మ కొండపోచమ్మ తల్లి

12-10-2025 03:41:27 PM

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో వెలసిన కొండపోచమ్మ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అని భక్తుల నమ్మకం. ఆదివారం కావడంతో కొమురవెల్లి మల్లన్న దర్శనం అనంతరం భక్తులు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్, నార్సింగి భక్తులు హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంట అని తెలిపారు. అమ్మ వారికీ మొక్కిన మొక్కులు తప్పకుండ నెరవేరుతాయన్నారు.