నిర్మల్ పోలీస్ కు డిజిపి అభినందనలు
10-06-2026 07:24 PM
నిర్మల్(విజయక్రాంతి): రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా నిర్మల్ వచ్చిన సివి ఆనంద్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు ఘన స్వాగతం పలికారు. ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న వెంటనే పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నిర్మల్ జిల్లా పోలీస్ బాగా పనిచేస్తుందని ఇక్కడ పోలీస్ శాఖ ద్వారా చేపట్టిన వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసం పెంచి పోలీస్ శాఖకు మంచి గుర్తింపు తెచ్చారని పేర్కొన్నారు. ఎస్పీగా పని చేస్తున్న జానకి షర్మిల పనితీరుపై ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు ఉపేందర్ రెడ్డి సాయికిరణ్ జిల్లా పోలీసులు ఉన్నారు.






