31 July, 2026 | 9:18 PM

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ

31-07-2026 08:16 PM

దమ్మపేట,(విజయక్రాంతి): రాబోవు మూడు సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక జి.పి.డి.పి గ్రామ సభను సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు అధ్యక్షతన కార్యదర్శి బండి అనంత్ కుమార్ శుక్రవారం దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు గ్రామాభివృద్ధికి ఉపయోగపడే పలు ప్రతిపాదనలు చేయవలసిందిగా కోరారు. అందరూ కలిసి తీర్మానం చేసే  ఇట్టి గ్రామ సభ ఫొటోలను, వీడియోలను నిర్ణయ యాప్ లో అప్లోడ్ చేయాలని ఇట్టి వివరాలు పంచాయతీరాజ్ కమిషనర్ కు చేరుతుందని తెలియజేశారు.

పాలకవర్గ సభ్యులు, గ్రామస్తుల ఇచ్చిన ప్రతిపాదనలలో ఇంకుడు గుంత నిర్మాణాలు, ప్లాస్టిక్ నిషేధం, డ్రైన్ నిర్మాణం, డంపింగ్ యార్డ్ లో టాయిలెట్స్ నిర్మాణం, కల్వర్ట్/బ్రిడ్జ్  నిర్మాణం, 5 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 1500 ఎల్.ఇ.డి లైట్లు, 2000 పంపు కనెక్షన్లు, రూఫ్ వాటర్ సంరక్షణ, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, 10 కిలోమీటర్ల మంచినీటి పైపులైను, ఓవర్ హెడ్ ట్యాంక్ రిపేర్లకు, స్మశాన వాటిక, పాఠశాలలకు తదితర ప్రధానమైన వాటికోసం కాంపౌండ్ వాల్ నిర్మాణం, రైతుల పొలాల్లో ఫామ్ పాండ్స్ నిర్మాణం, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇంకుడు గుంత, శానిటరీ కాంప్లెక్స్, కమ్యూనిటీ ఇంకుడు గుంత తదితర వాటిని తీర్మానం చేశారు.

భగీరథ నీళ్లు తాగడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని గ్రామ ప్రజలకు నుండి ఫిర్యాదులు ఉన్నాయని కానీ భగీరథ నీళ్లు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీరు అందిస్తుందని. 2026 సంవత్సరం జనవరి నుండి జూన్ వరకు వాటర్ ట్యాంక్ మోటర్లకు వచ్చిన కరెంటు బిల్లు ఖర్చు 54 లక్షలు అని తెలియజేశారు. ఈ సభలో ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, దారా రాము, తదితరులు పాల్గొన్నారు.