31 July, 2026 | 9:32 PM

రేపు ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రులు

31-07-2026 08:55 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రేపు (ఆగస్టు 1) పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకోనున్న ఇరు మంత్రులు ప్రాజెక్టులోని ప్రస్తుత నీటి నిల్వలు, వరద ప్రవాహ పరిస్థితులు, నీటి విడుదల, ప్రాజెక్టు నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేయనున్నట్లు సమాచారం. ఈ పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.