31 July, 2026 | 9:03 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నగర మేయర్ కు ఘన సన్మానం

31-07-2026 08:23 PM

ముకరంపుర,(విజయక్రాంతి): టీఎన్జీవోఎస్ ఆహ్వానం మేరకు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్  టీఎన్జీవోఎస్ జిల్లా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోఎస్ నాయకులు, సభ్యులు మేయర్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.నగరాభివృద్ధికి మేయర్ కొలగాని శ్రీనివాస్ చేస్తున్న సేవలను టీఎన్జీవోఎస్ నాయకులు అభినందించారు. ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, పచ్చదనం వంటి అంశాల్లో మేయర్ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్  మాట్లాడుతూ, టీఎన్జీవోఎస్ సభ్యులు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పరస్పర సహకారంతో పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి  లక్ష్మణ్ రావు వివిధ శాఖల ఉద్యోగులు  పాల్గొన్నారు.