15 July, 2026 | 2:09 AM

ఫైనల్లో ధీరజ్ త్రయం

26-04-2024 12:22 AM

ఆర్చరీ ప్రపంచకప్

షాంఘై, ఏప్రిల్ 25: తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ జోరు అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతోంది. ఆర్చరీ ప్రపంచకప్ రికర్వ్ విభాగంలో ధీరజ్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్‌తో కూడిన భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. షాంఘై వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్లో ఈ త్రయం ఇటలీ జట్టును 55 55 56 ఓడించింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో దక్షిణ కొరియాతో ధీరజ్ టీమ్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖతో పాటు పురుషుల విభాగంలో ప్రియాన్ష్ సెమీఫైనల్లో అడుగుపెట్టి పతకం రేసులో ముందంజ వేశారు. ఇక ఇప్పటికే కాంపౌండ్ విభాగంలో పురుషులు, మహిళల జట్లు ఫైనల్ చేరి కనీసం రజత పతకాలను ఖరారు చేసుకున్నాయి. బుధవారం జరిగిన పోరులో మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ, అదితి, పర్ణీత్ కౌర్ త్రయం ఎస్తోనియాపై.. పురుషుల కాంపౌండ్ విభాగంలో అభిషేక్ వర్మ త్రయం టాప్‌సీడ్ దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాయి.