15 July, 2026 | 2:16 AM

కోహ్లీ ‘ది బెస్ట్’

26-04-2024 12:21 AM

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఆన్‌ఫీల్డ్‌లో మంచి ఈజ్‌తో కనిపిస్తాడని హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ ఏదైనా ఎప్పుడు తన బెస్ట్ ఇచ్చేందుకే కష్టపడతాడని తెలిపాడు. బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు కమిన్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘విరాట్‌ను చూస్తుంటే.. నాకు, అతడికి కొన్ని పోలికలున్నాయనిపిస్తుంది. కోహ్లీ ఏడాదిలో వంద రోజులు క్రికెట్ ఆడితే ప్రతీ మ్యాచ్‌లోనూ పరుగులు తీయడానికే ఇష్టపడతాడు. నేను అంతే.. ఆడే ప్రతీ మ్యాచ్‌లో వికెట్ తీయాలనుకుంటాను. ఆన్‌ఫీల్డ్ ,ఆఫ్ ఫీల్డ్ ఏదైనా కోహ్లీ నాలాగే రిలాక్స్‌గా కనిపిస్తాడు. అందుకే మేమిద్దరం సూపర్ కాంపిటీటివ్.’ అని చెప్పుకొచ్చాడు.