రెజర్స్‌కు బ్రేక్
మొదట బ్యాటింగ్‌కు దిగితే చాలు భారీ స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్‌రైజర్స్‌కు పరాజయం ఎదురైంది. బెంగళూరుతో జరిగిన గత పోరులో లీగ్‌లోనే అత్యధిక స్కోరు చేసిన రైజర్స్.. ఈ సారి సొంతగడ్డపై ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. బ్యాటింగ్ వైఫల్యంతో హైదరాబాద్ మూడో ఓటమి మూటగట్టుకోగా.. ఆరు పరాజయాల తర్వాత బెంగళూరు గెలుపు రుచిచూసింది. బ్యాటింగ్‌లో కోహ్లీ, రజత్ పాటిదార్ రాణించగా.. బౌలింగ్‌లో ఆర్సీబీ సమష్టిగా సత్తాచాటింది.
హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. ప్రత్యర్థి జట్లు తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తే చాలు అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్న రైజర్స్ బ్యాటర్లు.. ఛేదనలో తడబడ్డారు. గురువారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (43 బంతుల్లో 51; 4 ఫోర్లు, ఒక సిక్సర్), రజత్ పాటిదార్ (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించగా.. కామెరూన్ గ్రీన్ (37 నాటౌట్; 5 ఫోర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (25; 3 ఫోర్లు, ఒక సిక్సర్) పర్వాలేదనిపించారు.
విల్ జాక్స్ (6), లోమ్రర్ (7), దినేశ్ కార్తీక్ (11) విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో ఉనాద్కట్ 3, నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్ (40 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్), అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ కమిన్స్ (15 బంతుల్లో 31; ఒక ఫోర్, 3 సిక్సర్లు) కాస్త పోరాడగా.. మిగిలినవారు విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్ (1), మార్క్మ్ (7), నితీశ్ కుమార్ రెడ్డి (13), హెన్రిచ్ క్లాసెన్ (7), అబ్దుల్ సమద్ (10) ఆకట్టుకోలేకపోయారు. బెంగళూరు బౌలర్లలో కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, కామెరూన్ గ్రీన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రజత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది.
ఛేదనలో ప్చ్!
తాజా సీజన్‌లో హైదరాబాద్ విధ్వం సం సృష్టిస్తుండటంతో.. రైజర్స్ మెరుపులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు గురువారం ఉప్పల్ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. హెడ్, అభిషేక్, క్లాసెన్, మార్క్మ్,్ర నితీశ్, షాబాజ్, సమద్‌తో కూడిన బ్యాటింగ్ లైనప్ ఏమాత్రం దయలేకుండా విరుచుకు పడుతుండటంతో.. టాస్ గెలిచిన బెంగళూరు సారథి డుప్లెసి స్.. తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. దీంతో మరో భారీ స్కోర్ల మ్యాచ్ చూడాలని వచ్చిన ప్రేక్షకులకు నిరాశ ఎదురుకాగా.. కోహ్లీ, రజత్ హాఫ్‌సెంచరీలతో కదంతొక్కడం తో బెంగళూరు కూడా భారీ స్కోరు చేసింది. సన్‌రైజర్స్ 207 పరుగుల లక్ష్యం నిలువగా.. ఈ మాత్రం స్కోరును మనవాళ్లు ఊదేస్తారనుకుం టే.. అందుకు భిన్నమైన ఫలితం వచ్చింది.
బంతిని తప్పుగా అంచనా వేసిన హెడ్ తొలి ఓవర్ చివరి బంతికి ఔట్ కాగా.. కొన్ని మెరుపులు మెరిపించిన అభిషేక్ శర్మ కూడా ఔటయ్యాడు. ఆదుకుంటారనున్న మార్క్మ్,్ర క్లాసెన్ వెంటవెంటనే పెవిలియన్ చేరగా.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఒక ఎండ్‌లో షాబాజ్ అహ్మద్ కాస్త పోరాటం కనబర్చినా అతడికి సరైన సహకారం లభించ లేదు. కెప్టెన్ కమిన్స్ మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. ఇరు జట్ల మధ్య బెంగళూరులో జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును తిరగరాయగా.. ఆ పరాజయానికి ఆర్సీబీ బదులు తీర్చుకుంది. తాజా సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిన బెంగళూరు ఎట్టకేలకు విజయం వైపు నిలిచింది.






