బంగారం కొనొద్దని చెప్పడానికే వచ్చారా?
మోదీ పర్యటనపై మంత్రి పొన్నం విమర్శలు
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి) : ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు వస్తే మంచి జరుగుతుందని రాష్ట్ర ప్రజలంతా అనుకుంటే పెద్ద కోడి గుడ్డు సున్నా ఇచ్చిపోయారు.. తెలంగాణ ప్రజలు మీకో దండం అం టున్నారు.. అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
బంగారం కొనొద్దని, పెట్రోల్, డీజిల్, వంట నూనెలు వాడొద్దని చెప్పడానికే రాష్ట్రానికి మోదీ వచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోయి భయబ్రాంతులకు గురి చేసేలా మాట్లాడం తగదన్నారు. దేశ స్వాతంత్య్రంకోసం కాంగ్రెస్ పార్టీ పోరాడిందని, దేశ ఐక్యత కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణాలు అర్పించారని, అలాంటి గాంధీ కుటుంబ సభ్యుడిని మావోవాది, ముస్లిం లీగ్ అని అనడం బాధాకరమన్నారు.






