16 March, 2026 | 6:25 AM

విభిన్న షేడ్స్ బేబీ జాన్

05-11-2024 12:00 AM

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘తెరి’ హిట్ టాక్ నమోదు చేసుకుంది. దీన్నే ‘పోలీసోడు’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు హిందీలోనూ రాబోతోందీ చిత్రం. ‘బేబీ జాన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్, కీర్తిసురేశ్, వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. జాకీ ష్రాఫ్ విలన్ పాత్రను పోషించారు.

కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మురాద్ ఖేతా, ప్రియా అట్లీ, జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తున్నారు. ఇదే ఏడాది డిసెంబర్ 25న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.