16 March, 2026 | 5:02 AM

‘భైరవం’ భయంకరం

05-11-2024 12:00 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘భైరవం’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ రగ్గడ్ అండ్ రస్టిక్ లుక్‌లో టైటిల్‌కి తగ్గట్టుగానే టెరిఫిక్‌గా కనిపిస్తున్నారు.

బ్యాక్‌గ్రౌండ్‌లో దేవాలయం, ప్రజలు కాగడాలు పట్టుకొని ఉండటం వంటివి కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లను సైతం త్వరలోనే విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.